ధర రూ.17999 కే 50MP కెమెరా, 5000mAh 5G స్మార్ట్‌ఫోన్.. ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే..!
ఐకూ నుంచి ఇటీవల ఐకూ Z9 5G స్మార్ట్ ఫోన్ ( iQOO Z9 5G Smartphone ) విడుదల అయింది. ప్రస్తుతం అమెజాన్ లో ఐకూ క్వెస్ట్ డేస్ సేల్‌లో ( iQOO Quest Days sale 2024 ) భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌ను తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రత్యేక సేల్ లో ఇవాళ్టి నుంచి జూన్ 10 వరకు జరుగుతుంది. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్‌లను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు HDFC, ICICI బ్యాంకు కార్డుల ద్వారా రూ.3000 తగ్గింపును పొందవచ్చు.
రూ.17,999 కే కొనుగోలు చేయవచ్చు :
ఈ ఐకూ ప్రత్యేక సేల్‌లో భాగంగా ఐకూ 12, ఐకూ నియో 9 ప్రో, ఐకూ Z9 సహా ఐకూ Z9 5G స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఐకూ Z9 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ మరియు 8GB ర్యామ్ +256GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. హ్యాండ్‌సెట్ బేస్ వేరియంట్‌ను రూ.17,999 కే కొనుగోలు చేయవచ్చు.

ఐకూ Z9 5G స్మార్ట్ ఫోన్ (iQOO Z9 5G Smartphone) 6.67 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తుంది. 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7200 5G ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది.
50MP ప్రధాన కెమెరా, 5000mAh బ్యాటరీ :
ఐకూ Z9 5G స్మార్ట్ ఫోన్ OIS ( ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ) 50MP ప్రైమరీ కెమెరా, 2MP బోకెష్ లెన్స్ ను కలిగి ఉంది. సెల్పీ, వీడియోల కోసం ఈ హ్యాండ్ సెట్‌కు 16MP కెమెరాలను అమర్చారు. మరియు 44W ఛార్జింగ్ సపోర్టు తో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్ సెట్ వైఫై 6, బ్లూటూత్ 5.3, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. దీంతోపాటు IP54 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా వస్తుంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ ను రెండు రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. బ్రష్డ్ గ్రీన్ మరియు గ్రాఫేన్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








