Home
Mobile

7600mAh బ్యాటరీతో వచ్చేస్తున్న ఐకూ Z10 టర్బో.. 1.5K అమోలెడ్ డిస్‌ప్లేతో విజువల్ ట్రీట్ పక్కా..?

iQOO Z10 series: స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కి గుడ్‌న్యూస్. ఐకూ కంపెనీ కొత్త Z10 సిరీస్‌ని లాంచ్ చేయడానికి సిద్ధమైపోయింది. శక్తివంతమైన చిప్‌సెట్లు, హై-రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేలు, భారీ బ్యాటరీలతో ఈ Z10 సిరీస్ టాప్-లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, ఐకూ నాలుగు మోడల్స్‌ని రిలీజ్ చేయబోతోంది. అవి Z10x, Z10, Z10 టర్బో, Z10 టర్బో ప్రో. వీటి ముఖ్యమైన ఫీచర్లు తెలుసుకుందాం.

* ఐకూ Z10 టర్బో, టర్బో ప్రో

ఈ సిరీస్‌లోనే హైలైట్ మాత్రం Z10 టర్బోనే. ఇందులో 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంటుందట, అది కూడా 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుందట. అంటే వీడియో క్వాలిటీ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. పవర్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 8400 చిప్‌సెట్‌ని వాడారు.

iQOO Set to Launch Powerful Z10 Series with Turbo Models with 1 5K AMOLED Displays

Z10 టర్బో ప్రో విషయానికొస్తే, ఇందులో స్నాప్‌డ్రాగన్ SM8735 చిప్‌సెట్ ఉంటుందని అంటున్నారు. ఇది బహుశా త్వరలో రాబోయే స్నాప్‌డ్రాగన్ 8s ఎలైట్ SoC అయ్యుండొచ్చు. ఈ రెండు టర్బో మోడల్స్‌లోనూ బ్యాటరీలు కూడా భారీగానే ఉండబోతున్నాయి, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది Z10 టర్బోలో అయితే ఏకంగా 7,500–7,600mAh బ్యాటరీ ఉంటుందట.

90W ఛార్జింగ్‌తో దీని ఛార్జ్ చేసుకోవచ్చు అని సమాచారం. టర్బో ప్రోలో కొంచెం తక్కువగా 7,000mAh బ్యాటరీ ఉన్నా, ఛార్జింగ్ మాత్రం రాకెట్ స్పీడ్‌లో 120Wతో ఉంటుందట. ఇంకా ఈ రెండు ఫోన్లలోనూ విజువల్స్‌ని మరింత అదిరిపోయేలా చూపించడానికి ప్రత్యేకమైన డిస్‌ప్లే చిప్‌ని కూడా పెడుతున్నారు.

* కెమెరా, లాంచ్ ఎప్పుడంటే..

Z10 టర్బో, టర్బో ప్రో రెండిట్లోనూ 50MP సోనీ IMX882 మెయిన్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉంటాయని లీకులు వస్తున్నాయి. అంటే కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ముందు అనుకున్న ప్రకారం ఈ మోడల్స్ చైనాలో ఏప్రిల్‌లోనే లాంచ్ అవుతాయట. అంటే Z10 సిరీస్‌లో ముందుగా రిలీజ్ అయ్యే ఫోన్లు ఇవే.

* ఐకూ Z10, Z10x

సాధారణ ఐకూ Z10 మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 (SM7750) ప్రాసెసర్ ఉంటుంది, 1.5K OLED డిస్‌ప్లే కూడా ఇస్తున్నారు. అంటే ఇది పర్ఫార్మెన్స్, ధర రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుందని చెప్పొచ్చు. కాకపోతే ఇది ఎప్పుడు లాంచ్ చేస్తారనేది ఇంకా స్పష్టత లేదు.

ఐకూ Z10x వచ్చేసి ఈ సిరీస్‌లోనే అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది. ఇందులో LCD డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్ (మోడల్ నెంబర్ 24M) ఉంటాయి. టర్బో మోడల్స్ ఏప్రిల్‌లో వస్తే, Z10x మాత్రం 2025 క్యూ3లో రిలీజ్ అవుతుందని సమాచారం.

మొత్తానికి చూస్తే, శక్తివంతమైన హార్డ్‌వేర్, అదిరిపోయే డిస్‌ప్లేలు, మంచి ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఐకూ Z10 సిరీస్ మాత్రం మార్కెట్‌లో దుమ్ము రేపడానికి రెడీ అవుతోంది. ఇంకాస్త వివరాల కోసం మనం కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO Z10 series debuts soon, with Turbo and Pro models offering a 1.5K 144Hz AMOLED, powerful chips, fast charging, and big batteries, while the budget Z10x launches later.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X