అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఐకూ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు.. లిస్ట్..!
Amazon Great Republic Day Sale 2026 : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 జనవరి 16 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్ లో భాగంగా SBI క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ సేల్ కు సంబంధించిన డీల్స్ వివరాలను అమెజాన్ క్రమంగా విడుదల చేస్తోంది. తాజాగా అమెజాన్ సేల్ లో ఐకూ స్మార్ట్‌ఫోన్ డీల్స్ వివరాలు వెల్లడయ్యాయి. బడ్జెట్ ఫోన్‌ల నుంచి ఫ్లాగ్‌షిప్ మోడల్స్ వరకు డీల్స్ వివరాలను ఐకూ షేర్ చేసింది.
ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ :
ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ (iQOO 15 Smartphone) భారత్ మార్కెట్ లో ఇటీవల విడుదల అయింది. విడుదల సమయంలో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.72999 గా ఉంది. అయితే అమెజాన్ సేల్ లో భాగంగా రూ.64999 ధరకే కొనుగోలు చేయవచ్చని తెలిపింది. దీంతోపాటు 24 నెలల వరకు నో కాస్ట్ EMI ఆప్షన్‌ను అందిస్తోంది.

ఐకూ 15 144Hz రీఫ్రెష్ రేట్ తో 6.85 అంగుళాల శాంసంగ్ M14 8T LTPO 2K అమోలెడ్ ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తోంది. 50MP + 50MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ లెన్స్ + 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 100W వైర్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది.
నియో ఫోన్‌లపైనా :
అమెజాన్ సేల్ లో భాగంగా ఐకూ నియో 10 (iQOO Neo 10), నియో 10R (iQOO Neo 10R) స్మార్ట్‌ఫోన్‌లపైనా డిస్కౌంట్ ను ప్రకటన చేసింది. ఐకూ నియో 10 ఫోన్ ప్రారంభ ధర ప్రస్తుతం రూ.36,999 గా ఉంది. సేల్ లో భాగంగా రూ.33999 కే అందుబాటులోకి వస్తుందని తెలిపింది. దీంతోపాటు 6 నెలలపాటు నో కాస్ట్ EMI ప్రయోజనాలను కూడా పొందవచ్చని తెలిపింది.
The wait just got more exciting 🇮🇳✨
— iQOO India (@IqooInd) January 11, 2026
The Great Republic Day Sale is almost here, setting the stage for serious savings on iQOO smartphones.
From everyday smartphones to performance favourites, there’s an iQOO for every kind of upgrade this season.
With deals starting from just… pic.twitter.com/6KwHE9d9JM
అదే ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత ధర రూ.26999 గా ఉంది. అయితే సేల్ లో భాగంగా రూ.24999 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు గరిష్ఠంగా 6 నెలలపాటు నో కాస్ట్ EMI ప్రయోజనాలను అందిస్తున్నట్లు తెలిపింది. వీటితోపాటు ఐకూ Z10, ఐకూ Z10R (iQOO Z10R Smartphone), ఐకూ Z10x (iQOO Z10x Smartphone), ఐకూ Z10 లైట్ (iQOO Z19 Lite) వంటి మోడల్స్ పైనా డిస్కౌంట్ లను ప్రకటన చేసింది.
| స్మార్ట్‌ఫోన్ | సేల్ ఆఫర్ | EMI |
| ఐకూ Z10 | రూ.20999 | 6 నెలల వరకు నో కాస్ట్ EMI |
| ఐకూ Z10R | రూ.18499 | 6 నెలల వరకు నో కాస్ట్ EMI |
| ఐకూ Z10x | రూ.13499 | |
| ఐకూ Z10 లైట్ | రూ.9999 |
అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ 2026 లో భాగంగా SBI క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ను అందిస్తామని ఇప్పటికే అమెజాన్ తెలిపింది. అయితే పైన తెలిపిన డిస్కౌంట్‌లు.. ఈ క్రెడిట్ కార్డుపై ఇస్తున్న డిస్కౌంట్‌లకు అదనమా.. కాదా తెలియాల్సి ఉంది. త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు త్వరలో మరిన్ని స్మార్ట్‌ఫోన్ డీల్స్ వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








