iQOO 5G smartphone : ప్రీమియం విభాగంలో తక్కువ ధరతో మిగిలిన వారికి పోటీగా....

|

ఇండియాలో 'ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్' విభాగంలో ఆపిల్, శామ్‌సంగ్, వన్‌ప్లస్ వంటి బ్రాండ్లు ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. ఈ బ్రాండ్లు ఉత్తమ ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ లతో అత్యంత ఖరీదైన హ్యాండ్‌సెట్‌లను అందిస్తున్నాయి. ఏదేమైనా గొప్ప ఫీచర్స్ కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్లు మాత్రమే వినియోగదారులకు ఎల్లప్పుడూ ప్రీమియం అనుభవాన్ని అందించవు.

ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు
 

ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

అంతేకాకుండా ఈ రోజుల్లో అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు కూడా అద్భుతమైన ఆవిష్కరణలను కలిగి ఉన్నప్పటికీ వినియోగదారులకు గొప్ప ఫీచర్లను అందించడంలో కొన్ని విఫలమయ్యయి. అటువంటి సమస్యలను మార్చడానికి iQOO రంగంలోకి దిగింది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Samsung Galaxy S20 5G: శామ్‌సంగ్ 5G ఫోన్‌లు... ధర కాస్త ఎక్కువే...

iQOO

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివిధ రకాల విభాగాలలోని వివిధ సమస్యలను తన కొత్త ఆఫర్లతో పరిష్కరించడానికి iQOO కంపెనీ సిద్ధంగా ఉంది. ప్రీమియం మరియు విలువ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఇంకా అందుబాటులో లేని వినూత్న ఫీచర్లను అందించడానికి iQOO త్వరలో ఉతేజకరమైన ఉత్పత్తి శ్రేణిని ప్రవేశపెట్టనుంది. రాబోయే ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లైనప్ గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Galaxy S20, S20+, 5G Support ఫోన్‌లు ఎలా ఉన్నాయో లుక్ వేసుకోండి!!!!

iQOO కంపెనీ?

iQOO కంపెనీ?

iQOO ను వివో యొక్క సబ్-బ్రాండ్ అని అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. ఇది ప్రత్యేకమైన ప్రతిపాదనతో వచ్చిన సరికొత్త సంస్థ. 'iQOO ' బ్రాండ్ పేరు యొక్క ప్రత్యేకమైన నినాదం "ఐ క్వెస్ట్ ఆన్ అండ్ ఆన్". ఇది తన నుండి వస్తున్న ఉత్పత్తులను నిరంతరం మెరుగుపరచడానికి ఈ బ్రాండ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. వాటిలో శక్తివంతమైన టెక్నాలజీ, కెమెరా, సాఫ్ట్‌వేర్ మరియు గేమింగ్ సామర్థ్యాలలోని సాంకేతిక పరిజ్ఞాన అనుభవాన్ని అందించడానికి iQOO కృషి చేస్తున్నది. IQOO ఉత్పత్తుల యొక్క ముఖ్య ఉద్దేశం నిరంతరాయమైన కంటెంట్ వినియోగాన్ని అందించగల సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్‌లను తయారుచేయడం.

Jio వాడుతున్నారా? ఈ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోండి...

iQOO స్మార్ట్‌ఫోన్‌లు
 

iQOO స్మార్ట్‌ఫోన్‌లు

ధరల విభాగంలో బడ్జెట్ మరియు మిడ్-రేంజ్ వర్గాలను ఎక్కువగా లక్ష్యంగా చేసుకునే వివో మాదిరిగా కాకుండా వినియోగదారులకు గొప్ప అనుభవాన్ని అందించడానికి iQOO కంపెనీ ప్రీమియం విభాగంలో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తుంది. వినియోగదారులకు సరసమైన ధర వద్ద ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగానికి అప్‌గ్రేడ్ అయ్యే ఉత్పత్తులను తయారుచేస్తున్నది. iQOO స్మార్ట్‌ఫోన్‌లు ఉత్తమ తరగతి ఫీచర్లను అందింస్తున్నప్పటికీ ఇవి సరసమైన ధర ట్యాగ్ ను కలిగి ఉంటాయి.

iQOO స్మార్ట్‌ఫోన్ లైనప్ నుండి ఏమి ఆశించాలి?

iQOO స్మార్ట్‌ఫోన్ లైనప్ నుండి ఏమి ఆశించాలి?

స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో అత్యుత్తమ పనితీరుతో మరియు గొప్ప స్పెసిఫికేషన్ల మిశ్రమంతో స్మార్ట్‌ఫోన్‌లను ప్రారంభించాలని iQOO సంస్థ యోచిస్తోంది. ఈ కంపెనీ నుండి రాబోయే స్మార్ట్‌ఫోన్‌లలో స్టాక్ ఆండ్రాయిడ్ యూజర్ అనుభవానికి రిఫ్రెష్ అనుభూతిని కూడా మనం చూడవచ్చు.

Poco X2 Review in Telugu: 120HZప్యానల్,27W ఫాస్ట్ చార్జర్, బెస్ట్ ఫీచర్లు

 ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగం

చైనాలో ఇప్పటికే ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో iQOO తన సత్తా చాటుకోవడానికి iQOO నియో సిరీస్ కింద iQOO అనేక స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. నివేదికల ప్రకారం ఈ సంస్థ కేవలం 4 గంటల్లోనే 200,000 కంటే ఎక్కువ iQOO ప్రో 5G హ్యాండ్‌సెట్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించింది.

OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్

ఇండియాలో iQOO మొదటి వాణిజ్య 5G స్మార్ట్‌ఫోన్‌

ఇండియాలో iQOO మొదటి వాణిజ్య 5G స్మార్ట్‌ఫోన్‌

iQOO సంస్థ యొక్క మొదటి 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విడుదల చేయాలని సూచిస్తుంది. నివేదికల ప్రకారం ఈ రాబోయే iQOO స్మార్ట్‌ఫోన్ దేశంలో వాణిజ్యపరంగా లభించే మొదటి 5G స్మార్ట్‌ఫోన్ అవుతుంది. 5G నెట్‌వర్క్ దేశంలో ఇంకా విడుదల కాలేదు కావున వేగవంతమైన 5G నెట్‌వర్క్‌లను ఉపయోగించుకునే యూజర్ల జాబితాలో iQOO యొక్క హ్యాండ్‌సెట్లు ఎక్కువగా ఉంటాయి.

OnePlus 8 Pro: బ్రహ్మాండమైన ఫీచర్స్ ఇవే... ఈ ధర విభాగంలో గట్టి పోటీ

 5G నెట్‌వర్క్‌

iQOO స్మార్ట్‌ఫోన్‌లు 5G నెట్‌వర్క్‌లలో ఉత్తమ వినియోగదారు అనుభవాన్ని అందిస్తాయి.ఈ హ్యాండ్‌సెట్‌లు నిరంతరం కంటెంట్ వినియోగ అనుభవం అందించడంతో పాటుగా బఫర్-రహిత వీడియో స్ట్రీమింగ్ మరియు లాగ్-ఫ్రీ గేమ్‌ప్లేని అందించడానికి వేగవంతమైన నెట్‌వర్క్‌లను ఉపయోగించుకుంటాయి.

స్నాప్‌డ్రాగన్ 865 స్మార్ట్‌ఫోన్

స్నాప్‌డ్రాగన్ 865 స్మార్ట్‌ఫోన్

iQOO స్మార్ట్‌ఫోన్‌లు సరికొత్త స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్‌ను వినియోగిస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్‌గా భారతీయ మార్కెట్లోకి పరిచయం కాబోతున్నది. ఈ ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఉత్తమమైన పనితీరు అనుభవాన్ని అందించడానికి ఉద్దేశించబడింది. iQOO యొక్క స్మార్ట్‌ఫోన్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌తో పాటు మునుపెన్నడూ చూడని కొన్ని గొప్ప ఆవిష్కరణలను కూడా అందిస్తుంది. విప్లవాత్మక కెమెరా సెటప్ మరియు వేగవంతమైన 5G నెట్‌వర్క్‌లను ఎక్కువగా ఉపయోగించుకునే ప్రత్యేకమైన గేమ్-సెంట్రిక్ ఫీచర్ల కోసం పెద్ద డిస్ప్లే ను కలిగి ఉంటుంది అని మేము ఆశిస్తున్నాము.

Vodafone Rs 555 Plan ప్రయోజనాలు ఏంటో చూడండి

ఫ్యాషన్ ఫార్వర్డ్

iQOO యొక్క స్మార్ట్‌ఫోన్ ఫ్యాషన్ ఫార్వర్డ్ వినియోగదారుల అవసరాలకు సరిపోయే ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంటుంది. అదనంగా ప్రీమియం విభాగంలో హ్యాండ్‌సెట్‌ను వేరుచేసే కొన్ని ఫీచర్లను కూడా కంపెనీ సూచించింది. రాబోయే సంవత్సరాల్లో స్మార్ట్‌ఫోన్‌ల కోసం కొత్త ప్రమాణాలను నిర్ణయించడానికి అర్ధవంతమైన ఆవిష్కరణలతో iQOO హ్యాండ్‌సెట్‌లను విడుదల చేస్తుందని మేము ఆశిస్తున్నాము.

Valentines Day Gift గా బెస్ట్ సెల్ఫీ ఫోన్ ఇస్తే ఎలా ఉంటుంది ?

iQOO స్మార్ట్‌ఫోన్ లైనప్ ధర

iQOO స్మార్ట్‌ఫోన్ లైనప్ ధర

iQOO స్మార్ట్‌ఫోన్ లైనప్ ధర గురించి ఖచ్చితమైన సమాచారం మా వద్ద లేదు. ఏదేమైనా ఈ ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్‌ను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడానికి కంపెనీ సరసమైన ధరను నిర్ధారిస్తుంది అని మాత్రం చెప్పగలము. SD865 శక్తితో పనిచేసే 5G హ్యాండ్‌సెట్ కొద్దిగా ప్రీమియం ధరను కలిగి ఉండగా సంస్థ యొక్క 'నియో' సిరీస్ పవర్ ప్యాక్ చేసిన హ్యాండ్‌సెట్లను సరసమైన ధర పాయింట్‌లో అందిస్తుంది.

గూగుల్ మ్యాప్‌లో ఇకపై ట్రెండింగ్ స్పాట్స్

iQOO నియో సిరీస్

iQOO నియో సిరీస్

iQOO నియో సిరీస్ హ్యాండ్‌సెట్‌లు 15-30 సంవత్సరాల మధ్య వయస్సు గల వినియోగదారుల యొక్క అన్ని రకాల సమస్యలను తీర్చగలవు. స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు ధర-పాయింట్‌ను నిర్ణయాత్మక కారకంగా ప్రతి ఒక్కరు చూస్తారు. దీనికి స్వస్తి చెప్పడానికి ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్‌ను వచ్చే నెలలో భారత మార్కెట్లో విడుదల చేయాలని iQOO సంస్థ యోచిస్తోంది.

BSNL 4G: 4G స్పెక్ట్రంను అందుకున్న BSNL... త్వరలోనే ప్రారంభం...

ఆన్‌లైన్‌ ద్వారా అందుబాటులోకి

ఆన్‌లైన్‌ ద్వారా అందుబాటులోకి

స్మార్ట్‌ఫోన్ ప్లేయర్‌లకు రాబడిని పెంచడానికి iQOO కూడా దాని హ్యాండ్‌సెట్లను విక్రయించడానికి 'ఆన్‌లైన్-ఫస్ట్' సేల్స్ వ్యూహంతో ప్రారంబిస్తోంది. ఏదేమైనా సంస్థ తన యొక్క బ్రాండ్ ను విస్తరించడానికి దాని పోర్ట్‌ఫోలియోను కొత్తగా పరిచయం చేస్తున్నందున మొదటగా ఆన్‌లైన్ సేల్స్ ద్వారా వెళుతున్నది. తరువాతి దశలో విస్తృత వినియోగదారుల స్థావరాన్ని చేరుకోవడానికి iQOO కూడా ఆఫ్‌లైన్ మార్కెట్‌కు వెళుతుంది అని మేము భావిస్తున్నాము. మొదటి సేల్స్ తరువాత ఈ బ్రాండ్ స్వతంత్రంగా పనిచేస్తుంది మరియు దాని వినియోగదారు అభ్యర్థనలను పరిష్కరించడానికి ప్రత్యేక సేవా కేంద్రాలను కలిగి ఉంటుంది. దేశంలో విస్తరించే iQOO ప్రణాళికలపై మాకు ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు.

BSNL Bharat Fibre: 2000GB డేటా ప్రయోజనంతో కొత్త ప్లాన్

ఇండియాలో iQOO బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌?

ఇండియాలో iQOO బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌?

ప్రీమియం విభాగంలో అగ్రశ్రేణి ఆటగాళ్ళకు పోటీగా వారితో సమానమైన చోటును దక్కించుకునే ఉద్దేశంతో ప్రత్యేకమైన దృష్టితో ఐక్యూఓ భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తోంది. భారతదేశంలో పూర్తిగా తన కొత్త బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క వ్యాప్తిని పెంపొందించడానికి కంపెనీ వేగవంతమైన, అర్ధవంతమైన ఆవిష్కరణలు మరియు టాప్-ఆఫ్-ది-లైన్ హార్డ్‌వేర్‌లను బ్యాంక్ చేస్తున్నది. మొట్టమొదటి iQOO బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌తో దేశంలోని ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో గొప్ప ఆవిష్కరణలను ఆసక్తికరంగా తీసుకురాబోతున్నది.

Most Read Articles
Best Mobiles in India

English summary
iQOO To Disrupt Indian Smartphone Market With Premium Products

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X