Home
Mobile

స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారా.. అయితే ఈ ఫోన్‌ల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి..!

భారత్‌ మార్కెట్‌లో ఇటీవల విడుదల అయిన మూడు స్మార్ట్‌ఫోన్‌లు భారీ బ్యాటరీలకు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా హెవీ యూజర్లకు ఈ ఫోన్‌లు బాగా ఉపయోగపడతాయి. ఈ ఏప్రిల్‌ నెలలో ఐకూ Z10, వివో V4 5G, ఒప్పో K13 5G ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్లు 7000mAh లేదా అంతకంటే ఎక్కువ బ్యాటరీలతో లాంచ్ అయ్యాయి. సులభంగా రెండు రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.

ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ 7300mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. అదే విధంగా వివో T4 5G స్మార్ట్‌ఫోన్‌ కూడా 7300mAh బ్యాటరీతో లాంచ్‌ అయింది. మరో ప్రముఖ సంస్థ ఒప్పో కూడా 7000mAh బ్యాటరీతో K13 5G ఫోన్‌ను భారత్‌ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌ల పూర్తి వివరాలు.

iQOO  Vivo  OPPO large battery smartphone in india

ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ :
ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్‌ (iQOO Z10) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.21999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.23999, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.25999 గా ఉంది. ఐకూ ఇండియా, అమెజాన్‌లో ఈ ఫోన్‌ ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

ఐకూ Z10 హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.77 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 5000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. మరియు మిలిటరీ గ్రేడ్‌ MIL STD 810H సర్టిఫికేషన్‌తో అందుబాటులోకి వచ్చింది. 90W ఛార్జింగ్‌ సపోర్టుతో 7300mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి ఏకంగా 52 గంటల వరకు కాల్స్‌ మాట్లాడుకోవచ్చు.

ఐకూ హ్యాండ్‌సెట్‌ ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 2 సంవత్సరాల వరకు OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ పొందవచ్చు. AI సర్కిల్‌ టూ సెర్చ్, AI Erase, AI Super Document, AI Note Assist వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.

ఈ ఐకూ స్మా్ర్ట్‌ఫోన్ f/1.8 అపేచర్‌తో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా (OIS), f/2.4 అపేచర్‌తో 2MP సెకండరీ కెమెరా, సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాలను కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌తో అందుబాటులోకి వచ్చింది. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

వివో T4 5G స్మార్ట్‌ఫోన్‌ :
వివో T4 5G స్మార్ట్‌ఫోన్‌ (Vivo T4 5G) 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ క్వాడ్ కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 5000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. 4nm ఆక్టా కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 3 SoC ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 తో పనిచేస్తుంది.

ఈ ఫోన్‌ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది. మరియు 90W వైర్‌ ఫ్లాష్‌ ఛార్జింగ్‌, రివర్స్‌ ఛార్జింగ్‌, బైపాస్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh బ్యాటరీని కలిగి ఉంది. 65 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చని వివో చెబుతోంది.

ఈ ఫోన్ వెట్‌ హ్యాండ్‌ టచ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులతోనూ ఫోన్‌ను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు AI Photo Enhance, AI Erase, Live Text, AI Note Assistant, సూపర్‌ డాక్యుమెంట్‌, సర్కిల్ టూ సెర్చ్‌ వంటి అనేక ఫీచర్‌లు ఉన్నాయి.
కెమెరా విభాగం పరంగా f/1.8 అపేచర్‌ 50MP ప్రైమరీ కెమెరా (OIS), f/2.4 అపేచర్‌తో 2MP సెకండరీ కెమెరా, f/2.0 అపేచర్‌తో 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.21999, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.23999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.25999 గా ఉంది. ఏప్రిల్ 29 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. వివో ఇండియా ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఇతర రిటైల్‌ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్‌ :
K13 5G స్మార్ట్‌ఫోన్‌ (OPPO K13 5G) 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల అమోలెడ్‌ ఫ్లాట్‌ డిస్‌ప్లేతో లాంచ్‌ అయింది. వెట్‌ హ్యాండ్‌ టచ్‌, గ్లౌజ్‌ మోడ్‌ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులు, గ్లౌజ్‌ తోనూ ఈ ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు. 4nm స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 4 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ColorOS 15 ను కలిగి ఉంది.

ఈ ఒప్పో ఫోన్‌ 80W Supervooc ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 62 శాతం ఛార్జింగ్‌ను కేవలం 30 నిమిషాల్లో చేయవచ్చని, 100 శాతం ఛార్జింగ్‌ను 56 నిమిషాల్లో పూర్తి చేయవచ్చని సంస్థ చెబుతోంది. IP65 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

కెమెరా విభాగం f/1.85 అపేచర్‌తో 50MP OV50D40 ప్రైమరీ కెమెరా, 2MP OV02B1B సెకండరీ కెమెరా, 16MP సోనీ IMX480 కెమెరాలను కలిగి ఉంది. గేమింగ్‌ కోసం వైఫై యాంటెనా, నెట్‌వర్క్‌ పెర్ఫామెన్స్‌ కోసం AI LinkBoost 2.0 టెక్నాలజీను ఉపయోగిస్తున్నారు. AI Eraser 2.0, AI Reflection remover, AI Blur వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.

ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19999 గా ఉంది. ఏప్రిల్ 25 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఒప్పో ఈ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
iQOO, Vivo, OPPO large battery smartphone in india 2025 best choice for heavy users
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X