Home
Mobile

తొలి భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.2000 డిస్కౌంట్‌.. స్లిమ్‌ డిజైన్‌, మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ సహా..!

భారత్‌ మార్కెట్‌లోకి ఈ సంవత్సరం ఏప్రిల్‌లో తొలి భారీ బ్యాటరీ ఫోన్ ఐకూ Z10 విడుదల అయింది. ఈ ఫోన్ ఏకంగా 7300mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. అనంతరం అనేక బ్రాండ్‌లు భారీ బ్యాటరీలతో తమ మోడల్స్‌ను లాంచ్ చేశాయి. అయితే ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్‌ను (iQOO Z10 Smartphone) ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో భారీ బ్యాటరీతోపాటు అనేక ప్రత్యేకతలున్నాయి.

రూ.2000 డిస్కౌంట్ :
ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.21998, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.23998, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.25998 గా ఉంది. SBI, ICICI బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

iQOO Z10 5G Smartphone telugu news

రూ.20 వేల కంటే తక్కువ ధరలో :
ఫలితంగా ఈ ఫోన్‌ను రూ.20 వేల కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వస్తుంది. దీంతోపాటు ఇతర బ్యాంకు కార్డులపైనా డిస్కౌంట్‌ ఆఫర్లు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ గ్లేసియల్‌ సిల్వర్‌, స్టెల్లర్ బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

7300mAh బ్యాటరీ :
ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్‌ 90W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7300mAh భారీ బ్యాటరీతో పనిచేస్తోంది. మీడియం యూజర్లకు రెండు రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ వచ్చే అవకాశం ఉంది. అయితే భారీ బ్యాటరీని కలిగి ఉన్నా.. ఈ ఫోన్‌ సన్నని డిజైన్‌ను కలిగి ఉంది.

iQOO Z10 5G Smartphone telugu news

మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ :
ఐకూ Z10 హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.77 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. మరియు 5000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా మిలిటరీ గ్రేడ్‌ MIL STD 810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 12GB LPDDR4x ర్యామ్‌, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 సంవత్సరాల OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ IMX882 కెమెరా, 2MP కెమెరాను కలిగి ఉంది. మరియు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. సర్కిల్‌ టూ సెర్చ్, AI Erase, AI Note Assist, AI Super Document వంటి ఫీచర్లున్నాయి.

ఐకూ Z10 5G స్మార్ట్‌ఫోన్‌ IP65 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. భద్రత కోసం ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, WiFi, బ్లూటూత్ 5.2, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO Z10 5G Smartphone with 7300mAh Battery gets Rs2000 Discount on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X