7300mAh భారీ బ్యాటరీ 5G ఫోన్ కీలక వివరాలు వెల్లడి.. చిప్‌సెట్, డిస్‌ప్లే, కెమెరాలు, కలర్ వేరియంట్స్!
ఐకూ నుంచి ఇటీవల కీలక ప్రకటన వచ్చింది. ఐకూ Z10 5G స్మార్ట్‌ఫోన్‌ను (iQOO Z10 5G Smartphone) ఏకంగా 7300mAh బ్యాటరీతో లాంచ్ చేస్తామని వెల్లడించింది. దీంతోపాటు విడుదల తేదీని కూడా ప్రకటించింది. ఏప్రిల్ 11 వ తేదీన భారత్ మార్కెట్‌లో లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. అయితే తాజాగా ఈ భారీ బ్యాటరీ ఐకూ ఫోన్ కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి.
రీబ్రాండెడ్ వెర్షన్‌గా? :
ఐకూ Z10 5G స్మార్ట్‌ఫోన్ త్వరలో చైనాలో విడుదల కానున్న వివో Y300 ప్రో+ హ్యాండ్‌సెట్ రీబ్రాండెడ్ వెర్షన్‌గా లాంచ్ కానుందని తెలుస్తోంది. వివో ఫోన్ మార్చి 31 న చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ఆధారంగా ఐకూ ఫోన్ వివరాలు లీక్ అయ్యాయి.

ఐకూ Z10 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు! :
ప్రస్తుతం ఉన్న లీక్స్ ఆధారంగా ఐకూ Z10 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు అల్ట్రా స్లీక్ డిజైన్‌ను కలిగి ఉంటుందని ఐకూ తెలిపింది. ఐకూ తన సోషల్ మీడియా ద్వారా ఈ ఫోన్ కలర్ వేరియంట్స్ వివరాలను వెల్లడించింది. దీని ఆధారంగా గ్లేసియర్ సిల్వర్, స్టెల్లర్ బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి వస్తుంది.
ఇప్పటికే ఐకూ వెల్లడించిన వివరాల ఆధారంగా ఈ ఫోన్ 7300mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుందని తెలిపింది. భారీ బ్యాటరీతోను సన్నని డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 195 గ్రాములుగా ఉంటుందని సమాచారం.
కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా ఐకూ Z10 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంటుందని సమాచారం.
Witness the rise of a color that embodies cosmic luxury and elegance. ✨⚡ With a subtle shimmer and a refined matte finish, Stellar Black exudes high-class sophistication while radiating unmatched power.
— iQOO India (@IqooInd) March 25, 2025
Get ready to experience a new era of excellence—launching on 11th April!… pic.twitter.com/0Vmiyi3OXT
7300mAh బ్యాటరీ బ్యాటరీ ఐకూ ఫోన్ కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.4, వైఫై 6 లతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. IP64 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. భద్రత కోసం ఈ ఫోన్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. మెరుగైన ఆడియో కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లతో లాంచ్ కానుందని తెలుస్తోంది.
ఐకూ Z10 5G స్మార్ట్‌ఫోన్ రూ.25000 ధర సెగ్మెంట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మరియు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ ద్వారా సేల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. విడుదల సమయం దగ్గరపడే కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
వివో నుంచి కూడా 7300mAh బ్యాటరీతో వివో T4 5G లాంచ్ కానుందని తెలుస్తోంది. 91మొబైల్స్ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న వివో T4x 5G ఫోన్ 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు ఈ భారీ బ్యాటరీ వివో ఫోన్ స్పెసిఫికేషన్‌ల వివరాలు లీక్ అయ్యాయి.
వివో T4 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీప్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ అమోలెడ్ క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 తో పనిచేస్తుందని సమాచారం.


Click it and Unblock the Notifications








