Home
Mobile

రూ.9999 ధరకే 6000mAh బ్యాటరీ, 50MP సోనీ AI కెమెరా, 128GB స్టోరేజీ 5G స్మార్ట్‌ఫోన్‌..!

iQOO Z10 Lite 5G Smartphone Launch : ఐకూ Z10 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. రూ.10 వేల ధరలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 6000mAh భారీ బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఐకూ ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.

ఐకూ Z10 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో లాంచ్‌ అయింది. 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్ పీక్‌ బ్రైట్‌ను కలిగి ఉంది. Eye ప్రొటెక్షన్‌, పవర్‌ సేవింగ్‌ కోసం డార్క్‌ మోడ్‌ను కూడా సపోర్టు చేస్తుంది.

iQOO Z10 Lite 5G smartphone launched

చిప్‌సెట్‌ :
ఈ ఐకూ బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 8GB ర్యామ్‌తో జతచేసి ఉంది. ఈ ఫోన్‌ 128GB, 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది.

50MP కెమెరా, AI ఫీచర్‌లు :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP సోనీ AI కెమెరా, 2MP కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను అమర్చి ఉంది. ఈ ఫోన్‌ AI డాక్యుమెంట్‌ మోడ్‌, AI Erase, AI Photo Enhance వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది.

iQOO Z10 Lite 5G smartphone launched

6000mAh భారీ బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్‌ 15W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 70 గంటల మ్యూజిక్‌ ప్లేబ్యాక్‌ లేదా 37 గంటల కాలింగ్‌ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్‌ రెండు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

Take a Poll

IP64 రేటింగ్‌తో :
ఈ ఐకూ హ్యాండ్‌సెట్ MIL STD 810H, SGS 5 స్టార్‌ యాంటీ ఫాల్‌ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌ తో డస్ట్ మరియు స్ల్పాష్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 5G, బ్లూటూత్‌, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది.

ఐకూ Z10 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9999 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.12999 గా ఉంది.

ఈ ఫోన్‌ సేల్ జూన్‌ 25 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఐకూ ఇండియా ఇ-స్టోర్‌, అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్ సైబర్‌ గ్రీన్‌, టైటానియం బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
iQOO Z10 Lite 5G smartphone launched with 6000mAh battery, 50MP Sony AI camera in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X