Home
Mobile

రూ.10 వేల కంటే తక్కువ ధరలోనే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా 5G స్మార్ట్‌ఫోన్‌.. రేపే విడుదల..!

ఐకూ Z10 సిరీస్‌ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ ఐకూ Z10 లైట్‌ 5G రేపు (జూన్‌ 18) మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. విడుదల అనంతరం ఈ హ్యాండ్‌సెట్‌ ఐకూ ఇండియా వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ బడ్జెట్‌ ధరలోనే అందుబాటులోకి వస్తుందని లీక్స్ వచ్చాయి. తాజాగా ఐకూ తన సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ ద్వారా కీలక వివరాలను వెల్లడించింది.

ధర వివరాలు :
తాజాగా అమెజాన్‌ టీజర్‌ ఆధారంగా ఐకూ Z10 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ (iQOO Z10 Lite 5G smartphone) ప్రారంభ ధర రూ.9xxx గా ఉంటుదని పేర్కొంది. దీని ఆధారంగా రూ.10000 కంటే తక్కువ ధరకే ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులోకి రానుందని ధ్రువీకరణ అయింది. ఎంట్రీ లెవల్ ధరలో 5G ఫోన్ చూస్తున్న వారికి మంచి ఆప్షన్‌ అయ్యే అవకాశం ఉంది.

iQOO Z10 Lite 5G smartphone

బ్యాటరీ, కలర్‌ వేరియంట్స్ :
ఈ ఫోన్‌ ఎంట్రీ లెవల్ ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి రానున్నా.. మెరుగైన స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫోన్ 6000mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌ టైటానియం బ్లూ, సైబర్ గ్రీన్‌ వంటి రెండు కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. IP64 రేటింగ్‌ను కలిగి ఉంటుంది.

డిస్‌ప్లే :
ఇప్పటికే విడుదల అయిన వివరాల ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ 1000 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్‌ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌తోపాటు IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP సోనీ AI ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 5MP కెమెరాను అమర్చి ఉంటుంది.

చిప్‌సెట్‌, OS వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 5G చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేయబడి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఇందులో AI డాక్యుమెంట్ మోడ్‌, AI Photo Enhance, AI Erase వంటి ఫీచర్‌లున్నాయి.

ఐకూ Z10 సిరీస్‌ నుంచి ఇప్పటికే ఐకూ Z10, ఐకూ Z10x 5G స్మార్ట్‌ఫోన్‌లు భారత్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ ఏకంగా 7300mAh బ్యాటరీతో పనిచేస్తోంది. సుమారుగా రూ.20 వేల ధర రేంజ్‌లో అందుబాటులో ఉంది. అదే ఐకూ Z10x 5G వేరియంట్‌ 6500mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. రూ.15 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
iQOO Z10 Lite 5G smartphone price range confirmed ahead of launch on june 18 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X