Home
Mobile

రూ.9999 కే 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌.. రూ.500 డిస్కౌంట్‌తో ఇవాళ్టి నుంచే సేల్‌!

iQOO Z10 Lite 5G Sale : భారత్ మార్కెట్‌లో ఐకూ Z10 సిరీస్ నుంచి అనేక మోడల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఐకూ Z10 ఏకంగా 7300mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఐకూ Z10x 5G స్మార్ట్‌ఫోన్‌ 6500mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్‌ నుంచి ఇటీవలే మరో ఫోన్‌ లాంచ్‌ అయింది. ఐకూ Z10 లైట్‌ 5G పేరుతో విడుదల అయింది. ఈ ఫోన్‌ సేల్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌ ధర రూ.9999 గా ఉంది.

ఐకూ Z10 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్ సేల్‌ ఇవాళ్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఒప్పో ఇండియా ఇ-స్టోర్‌, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.12999 గా ఉంది.

iQOO Z10 Lite 5G Smartphone price

ఈ బ్యాంకు కార్డుపై డిస్కౌంట్ :
తొలి సేల్‌లో భాగంగా SBI కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అంతే ఫోన్‌ ప్రారంభ ధర రూ.9499 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్ సైబర్‌ గ్రీన్‌, టైటానియం బ్లూ వంటి రెండు కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

డిస్‌ప్లే వివరాలు :
ఐకూ Z10 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్ పీక్‌ బ్రైట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ MIL STD 810H, SGS 5 స్టార్‌ యాంటీ ఫాల్‌ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌ తో డస్ట్ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

iQOO Z10 Lite 5G Smartphone price

50MP కెమెరా, 6000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా ఐకూ Z10 లైట్ 5G హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ AI కెమెరా, 2MP కెమెరాలను కలిగి ఉంది. మరియు 5MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. బ్యాటరీ పరంగా ఈ ఫోన్ 15W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

చిప్‌సెట్‌, OS వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ రెండు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని ఐకూ తెలిపింది. ఈ ఫోన్‌ AI Document Mode, AI Erase, AI Photo Enhance వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఫీచర్‌లను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్‌, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మరియు ఎక్కువ సమయం వినియోగించినా కళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా Eye ప్రొటెక్షన్‌, పవర్‌ సేవింగ్‌ కోసం డార్క్‌ మోడ్‌ను కూడా సపోర్టు చేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO Z10 Lite 5G Smartphone sale to start from today via amazon with rs500 discount on bank cards
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X