రూ.10 వేల ధరలో మంచి ఫోన్ కోసం చూస్తున్నారా.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా ఫోన్‌పై ఓ లుక్కేయండి!
భారత్ మార్కెట్‌లో ప్రస్తుతం ఎంట్రీ లెవల్ ధర సెగ్మెంట్ లో అనేక స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. రూ.10 వేల ధరలో ఐకూ ఈ సంవత్సరం ఓ ఫోన్ ను లాంచ్ చేసింది. ఐకూ Z10 సిరీస్‌లో భాగంగా ఈ ఐకూ Z10 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ప్రస్తుతం రూ.10 వేల ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ ఫోన్‌లలో ఈ ఐకూ హ్యాండ్‌సెట్ ఒకటిగా ఉంది. ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP కెమెరా, 6000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. ఐకూ హ్యాండ్‌సెట్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.
ప్రస్తుతం అమెజాన్ లో ఐకూ Z10 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ (iQOO Z10 Lite 5G Smartphone) 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9998, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10998, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.12998 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు.

ఐకూ Z10 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్, SGS 5 స్టార్ యాంటీ ఫాల్ సర్టిఫికేషన్ లను కలిగి ఉంది. ఈ ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్ తో 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 1000 నిట్స్ పీక్ బ్రైట్ ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సైబర్ గ్రీన్, టైటానియం బ్లూ వంటి రెండు కలర్ వేరియంట్స్ లో లభిస్తోంది.
ఈ ఫోన్ డిస్‌ప్లే Eye ప్రొటెక్షన్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఫలితంగా ఎక్కువ సమయం ఉపయోగించినా కళ్లకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీంతోపాటు డార్క్ మోడ్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్జెట్ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్ తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంది.
3 సంవత్సరాల అప్‌డేట్స్ :
ఐకూ Z10x లైట్ 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని ఐకూ తెలిపింది.

6000mAh బ్యాటరీ :
ఈ ఫోన్ AI Erase, AI Photo Enhance, AI Document Mode వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది. 15W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. రూ.10 వేల ధరలో బ్యాటరీ పరంగా మంచి ఆప్షన్‌గా భావించవచ్చు.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ AI కెమెరా, 2MP కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను అమర్చారు. కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్, WiFi, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








