Home
Mobile

6000mAh బ్యాటరీ, ఆకట్టుకొనే డిజైన్‌తో ఐకూ Z10 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌.. విడుదల తేదీ వెల్లడి..!

ఐకూ Z10 సిరీస్‌లో భాగంగా ఇటీవల ఐకూ Z10, ఐకూ Z10x స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసిన సంస్థ... తాజాగా కీలక ప్రకటన చేసింది. ఐకూ Z10 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ ను భారత్ మార్కెట్‌ లో లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. విడుదల తేదీ సహా మరిన్ని వివరాలను వెల్లడించింది. ఐకూ Z10 లైట్‌ 5G ఫోన్‌ గత సంవత్సరం విడుదల అయిన ఐకూ Z9 లైట్‌ 5G మోడల్‌కు తర్వాత తరం వెర్షన్‌ గా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

ఐకూ ఇండియా తాజాగా అందించిన వివరాల ఆధారంగా ఐకూ Z10 లైట్‌ 5G (IQOO Z10 Lite 5G Smartphone) ఫోన్‌ జూన్‌ 18 వ తేదీన విడుదల కానుంది. మరియు ఈ ఫోన్‌ అమెజాన్ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ల వివరాలు కూడా వెల్లడించింది.

iQOO Z10 Lite 5G Smartphone

బ్యాటరీ వివరాలు :
ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్‌ ఏకంగా 7300mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. అదే ఐకూ Z10x 5G స్మార్ట్‌ఫోన్‌ 6500mAh బ్యాటరీతో విడుదల అయింది. అయితే త్వరలో విడుదల కానున్న ఐకూ Z10 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 6000mAh బ్యాటరీతో పనిచేస్తుందని ఐకూ వెల్లడించింది.

అయితే ఈ ఫోన్‌ ఫోన్‌ గురించి ఇతర వివరాలు వెల్లడించలేదు. అయితే ఐకూ విడుదల చేసిన టీజర్‌ ఆధారంగా ఐకూ Z10 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ఆకట్టుకొనే డిజైన్‌ ను కలిగి ఉంది. వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు బ్లూ కలర్ వేరియంట్‌ లో టీజర్‌లో కనిపించింది.

* ఐకూ Z10 ఫోన్‌ 6.77 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మిలిటరీ గ్రేడ్‌ MIL STD 810H సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 2 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ 90W ఫ్లాష్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. అయితే భారీ బ్యాటరీలో అందుబాటులోకి వచ్చిన 7.89 mm థిక్‌నెస్‌ ను మాత్రమే కలిగి ఉంది. మరియు ఈ ఫోన్ 50MP సోనీ IMX882 (OIS) కెమెరా, 2MP కెమెరాలతోపాటు 32MP కెమెరాలను కలిగి ఉంది.

* ఐకూ Z10x 5G ఫోన్ 6.72 అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తుంది.

ఈ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా 50MP అల్ట్రా HD కెమెరా, 2MP బోకేష్‌ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ధర సుమారుగా రూ.14 వేలుగా ఉంది.

FAQs
ఐకూ Z10 లైట్‌ 5G ఫోన్‌ ఎప్పుడు విడుదల కానుంది?

ఐకూ Z10 లైట్‌ 5G ఫోన్‌ జూన్‌ 18 వ తేదీన విడుదల కానుంది.

ఐకూ Z10 లైట్‌ 5G ఫోన్‌ ఎంత బ్యాటరీతో విడుదల కానుంది?

ఐకూ Z10 లైట్‌ 5G ఫోన్‌ 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఐకూ Z10 సిరీస్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫోన్‌లు ఏంటి?

7300mAh బ్యాటరీతో ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్‌, 6500mAh బ్యాటరీతో ఐకూ Z10x 5G స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

GizBot Technology
Best Mobiles in India

English summary
iQOO Z10 Lite 5G Smartphone with 6000mAh battery launch date revealed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X