రూ.10498 ధరకు.. 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP కెమెరా 5G ఫోన్..!
ఐకూ నుంచి భారత్ మార్కెట్ లోకి ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ నవంబర్ 26 వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. అయితే ఈ సంవత్సరం తొలి భాగంలో ఐకూ Z10 సిరీస్ లో భాగంగా ఐకూ Z10 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ (iQOO Z10 Lite 5G Smartphone) లాంచ్ అయింది. ఈ ఫోన్ ప్రస్తుతం రూ.10 వేల ధరలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తోపాటు 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
రూ.10498 ప్రారంభ ధరకు :
ఐకూ Z10 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్, ఐకూ ఇండియా ఇ-స్టోర్‌లో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10,498, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11,498, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.13,498 గా ఉంది. దీంతోపాటు బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ ను పొందవచ్చు.

మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌లు :
ఐకూ Z10 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తోపాటు SGS 5 స్టార్ యాంటీ ఫాల్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. మరియు IP64 రేటింగ్ తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ టైటానియం బ్లూ, సైబర్ గ్రీన్ కలర్ వేరియంట్స్ అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్ రేట్, 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ బ్రైట్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ Eye ప్రొటెక్షన్ ఫీచర్, డార్క్ మోడ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఫలితంగా ఎక్కువ సమయం ఉపయోగించినా కళ్లకు ఇబ్బంది లేకుండా ఉంటుంది.
3 సంవత్సరాల అప్‌డేట్స్, 6000mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ ఫోన్ 15W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP సోనీ AI కెమెరా, 2MP కెమెరాలు ఉన్నాయి. మరియు 5MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ AI Document Mode, AI Photo Enhance, AI Erase వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ హ్యాండ్‌సెట్ కనెక్టివిటీ పరంగా 5G, 4G, వైఫై, బ్లూటూత్, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఫేస్ అన్‌లాక్‌తోపాటు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంది. రూ.10 వేల ధరలో 5G ఫోన్ కోసం చూస్తుంటే, ఈ ఫోన్ మీకు మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








