Home
Mobile

6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో 5G ఫోన్.. తక్కువ ధరలోనే..!!

IQOO Z10 Lite 5G smartphone : ఐకూ Z10 సిరీస్‌ నుంచి ఈ సంవత్సరంలో ఐకూ Z10, ఐకూ Z10x 5G ఫోన్‌లు ఇప్పటికే విడుదల అయ్యాయి. ఈ సిరీస్‌ నుంచి ఐకూ Z10 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ జూన్‌ 18 వ తేదీన లాంచ్‌ కానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన డిజైన్‌ సహా బ్యాటరీ, చిప్‌సెట్‌, కెమెరాలు సహా మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ ద్వారా ఐకూ ఈ వివరాలు వెల్లడిస్తోంది.

ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్‌ ఏకంగా 7300mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. అదే Z10x 5G మోడల్‌ 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. త్వరలో రానున్న ఐకూ Z10 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. అయితే ఛార్జింగ్‌ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

IQOO Z10 Lite 5G

ఈ ఫోన్ డిజైన్‌ను ఇప్పటికే విడుదల అయింది. దీని ఆధారంగా ఫోన్‌ ఆకట్టుకుంటుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ సైబర్‌ గ్రీన్‌, టైటానియం బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లాంచ్ కానుంది. మరియు ఈ ఫోన్‌ IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంటుంది.

ఐకూ ఇటీవలే ఈ ఫోన్ చిప్‌సెట్‌ వివరాలను వెల్లడించింది. ఐకూ X పోస్ట్‌ ఆధారంగా ఐకూ Z10 లైట్‌ 5G ఫోన్‌ 6nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. అయితే ఈ ఫోన్ OS, స్టోరేజీ వేరియంట్స్‌ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

ఈ ఫోన్‌ కెమెరా వివరాలను కూడా ఐకూ వెల్లడించింది. దీని ఆధారంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP సోనీ కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 5MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వస్తుంది.

దీంతోపాటు ఈ ఫోన్‌ AI (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్) ఆధారిత ఇమేజ్‌ ఎడిటింగ్ టూల్స్‌ తో లాంచ్‌ కానుంది. ఇందులో AI Photo Enhance, AI Erase వంటి టూల్స్‌ ఉన్నాయి. ‌అయితే ఈ ఫోన్‌ డిస్‌ప్లే వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మరికొన్ని రోజుల్లో ఈ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఐకూ Z10 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ రూ.15000 కంటే తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ధరపై ఐకూ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ హ్యాండ్‌సెట్‌ జూన్‌ 18 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ ఫోన్ విడుదల అనంతరం సేల్‌ వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

* ఐకూ నుంచి ఇటీవల ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ అయింది. ఈ ఫోన్ 6.78 అంగుళాల 1.5k అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్ 4 చిప్‌సెట్‌, గేమింగ్‌ కోసం Q1 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX882 (OIS) కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 120W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.31999 గా ఉంది.

Best Mobiles in India

English summary
IQOO Z10 Lite 5G with 6000mAh battery, 50MP camara, dimensity 6300 chipset set to launch on june 18 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X