ఇవాళ్టి నుంచే 7300mAh బ్యాటరీ 5G ఫోన్ సేల్ ప్రారంభం.. 50MP కెమెరా, 6.77 అంగుళాల భారీ డిస్‌ప్లే సహా..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఐకూ ఇటీవల భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. సుమారు రూ.20 వేల ధరలో ఏకంగా 7300mAh బ్యాటరీ కలిగిన ఫోన్‌ను (iQOO Z10 Smartphone Sale) అందుబాటులోకి తీసుకొచ్చింది. హెవీ యూజర్లకు ఈ ఫోన్ ఎంతగానే ఉపయోగపడుతుంది. సాధారణ యూజర్లు రెండు రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చు. ఈ ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్ గ్లేసియర్ సిల్వర్, స్టెల్లర్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
ధర, సేల్ వివరాలు :
భారత్‌లో ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఐకూ ఇండియా స్టోర్, మరియు అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.21,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.23,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.25,999 గా ఉంది.

తొలి సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా గరిష్ఠంగా రూ.2,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ప్రారంభ ధర రూ.19,999 గా ఉండే అవకాశం ఉంది. సేల్‌లో భాగంగా ఛార్జర్, USB కేబుల్, ఫోన్ కేస్, ప్రొటెక్టివ్ ఫిల్మ్ ను కూడా అందిస్తామని ఐకూ తెలిపింది.
డిస్‌ప్లే వివరాలు :
ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. మరియు ఈ ఫోన్ 5000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. సూర్యకాంతిలోనూ సౌకర్యంగా ఈ ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్ ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా ఉండేందుకు మిలిటరీ గ్రేడ్ MIL STD 810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.
ప్రాసెసర్, OS వివరాలు :
ఐకూ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది. మరియు స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.
ఈ ఫోన్ కోసం 2 సంవత్సరాల వరకు OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని ఐకూ తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్ AI సూపర్ డాక్యుమెంట్, AI సర్కిల్ టూ సెర్చ్, AI Erase, AI నోట్ అసిస్ట్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది.

భారీ బ్యాటరీ :
ఈ ఫోన్‌లు ఎక్కువ మందిని ఆకట్టుకొనే అంశం ఏంటంటే.. భారీ బ్యాటరీ. ఈ ఫోన్ ఏకంగా 7300mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు.
కెమెరా వివరాలు :
భారీ బ్యాటరీ ఐకూ ఫోన్ మెరుగైన కెమెరాలను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో f/1.8 అపేచర్, OIS సపోర్టుతో 50MP సోనీ IMX882 కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP కెమెరాలతో అందుబాటులో ఉంది. మరియు ముందువైపు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.2, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టుతోపాటు కలర్ టెంపరేచర్ సెన్సార్, యాక్సెలిరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో స్కో్ప్, ఈ - కంపాస్, ఇన్‌ప్రారెడ్ బ్లాస్టర్ వంటి సెన్సార్‌లను కలిగి ఉంది.
ఈ ఫోన్ భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చినా 7.89 mm థిక్‌నెస్‌ను మాత్రమే కలిగి ఉంది. మరియు IP65 రేటింగ్‌తో కూడిన మెరుగైన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తోపాటు మరిన్ని ఫీచర్‌లున్నాయి.


Click it and Unblock the Notifications