Home
Mobile

గీక్‌బెంచ్‌లో ఐకూ Z10 టర్బో, ప్రో ప్రత్యక్షం.. వీటి ప్రాసెసర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

By Ram Kumar

ప్రముఖ చైనీస్ మొబైల్ తయారీ దిగ్గజం ఐకూ గేమింగ్ లవర్స్ కోసం బడ్జెట్లో పవర్‌ఫుల్ ఫోన్లు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాలో కూడా ఇవి సూపర్ హిట్ అయ్యాయి. ఇదిలా ఉండగా ఐకూ Z10 టర్బో, Z10 టర్బో ప్రో ఫోన్లు త్వరలోనే మార్కెట్లోకి దూసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

తాజాగా వీటి ప్రోటోటైప్స్‌ గీక్‌బెంచ్ (Geekbench) పరీక్షల్లో కనిపించడంతో ఈ వార్త మరింత ఊపందుకుంది. ఈ ఫోన్లలో చాలా పవర్ఫుల్ ప్రాసెసర్లు వాడుతున్నారు. ఐకూ Z10 టర్బో ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8400 (MediaTek Dimensity 8400) ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారని గీక్‌బెంచ్ టెస్టుల్లో స్పష్టమయ్యింది.

iQOO Z10 Turbo and Pro Variants Spotted with Powerful Chipsets

హై-ఎండ్ ఫీచర్లతో రాబోతున్న ఐకూ Z10 టర్బో ప్రో మోడల్‌లో అయితే, ఇంకా విడుదల కాని క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s ఎలైట్ (Snapdragon 8s Elite) చిప్‌సెట్‌ను ఉపయోగిస్తున్నారు.

* గీక్‌బెంచ్ టెస్టులు కంప్లీట్

గీక్‌బెంచ్ అనేది స్మార్ట్‌ఫోన్ల పనితీరును పరీక్షించే ఒక వేదిక. ఇక్కడ ఈ ఫోన్ల స్కోర్లను చూస్తే, వాటి పవర్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. మైస్మార్ట్‌ప్రైస్ గుర్తించిన వివరాల ప్రకారం, V2452A, V2453A అనే మోడల్ నంబర్లతో ఈ ఫోన్లను పరీక్షించడం జరిగింది. వీటిలో V2452A మోడల్ iQOO Z10 టర్బో కాగా, V2453A మోడల్ Z10 టర్బో ప్రో అని తెలుస్తోంది.

ఐకూ Z10 టర్బో సింగిల్-కోర్ పరీక్షలో 1,593 పాయింట్లు, మల్టీ-కోర్ పరీక్షలో ఏకంగా 6,455 పాయింట్లను సాధించింది. దీని ప్రాసెసర్ 2.10GHz బేస్ ఫ్రీక్వెన్సీతో పనిచేస్తుంది.

అంతేకాదు, ఇందులో 3.0GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేసే మూడు కోర్లు 3.25GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేసే ఒక ప్రైమ్ కోర్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ 12GB ర్యామ్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తోంది.

మరోవైపు, ఐకూ Z10 టర్బో ప్రో ఇంకాస్త ముందుంది. ఇది సింగిల్-కోర్ పరీక్షలో 1,960 పాయింట్లు, మల్టీ-కోర్ పరీక్షలో 5,764 పాయింట్లు సాధించింది. ఇందులో 3.21GHz ప్రైమ్ కోర్, 3.01GHz క్లాక్ స్పీడ్‌తో మూడు కోర్‌లు, 2.80GHz క్లాక్ స్పీడ్‌తో రెండు కోర్లు, 2.20GHz క్లాక్ స్పీడ్‌తో మరో రెండు కోర్లు ఉన్నాయి.

దీనికి తోడు పవర్‌ఫుల్ అడ్రినో 825 (Adreno 825) గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉంది. ఇది కూడా 12GB ర్యామ్, ఆండ్రాయిడ్ 15తో రానుంది.

* ప్రాసెసరే స్పెషల్ అట్రాక్షన్

స్నాప్‌డ్రాగన్ 8s ఎలైట్ గతేడాది వచ్చిన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 (Snapdragon 8 Gen 3) చిప్‌సెట్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌లా కనిపిస్తోంది. అయితే, ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ కంటే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ చిప్‌సెట్ 2025 ప్రారంభంలో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది.

* ఫస్ట్ ఫోన్ అదే

ఈ స్నాప్‌డ్రాగన్ 8s ఎలైట్ చిప్‌తో మొదటగా మార్కెట్‌లోకి వచ్చే ఫోన్ షియోమీ సివి 5 (Xiaomi Civi 5) అని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో స్మార్ట్‌ఫోన్ల మధ్య గట్టి పోటీ ఉండబోతుందని అర్థమవుతోంది.

మొత్తానికి, iQOO తమ కొత్త ఫోన్లలో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు, పవర్ఫుల్ ప్రాసెసర్లను అందించడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్లు మార్కెట్‌లోకి వస్తే ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో చూడాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
The iQOO Z10 Turbo and Z10 Turbo Pro, spotted on Geekbench, feature MediaTek Dimensity 8400 and Snapdragon 8s Elite chipsets, respectively, with 12GB RAM and Android 15, offering impressive performance.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X