iQOO నుంచి 7620mAh, 7000mAh భారీ బ్యాటరీలతో రెండు 5G స్మార్ట్‌ఫోన్‌లు విడుదల.. పూర్తి వివరాలు!
ఐకూ నుంచి Z10 టర్బో, టర్బో ప్రో స్మార్ట్‌ఫోన్ లు (iQOO Z10 Turbo Series) లాంచ్ అయ్యాయి. ఆండ్రాయిడ్ 15 తోపాటు IP65 రేటింగ్ తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు ప్రత్యేక Q1 గేమింగ్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ప్రో వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ ను పనిచేస్తోంది. ఈ రెండు ఫోన్‌లు భారీ బ్యాటరీలను కలిగి ఉన్నాయి. మరియు 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అయితే ప్రస్తుతం ఈ ఫోన్ చైనాలో మాత్రమే విడుదల అయింది. భారత్ సహా గ్లోబల్ మార్కెట్ లో విడుదలపై ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు.
* ఐకూ Z10 టర్బో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ లు, ఫీచర్ లు పూర్తి వివరాలు :
ఐకూ Z10 టర్బో స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్, 3000Hz టచ్ శాంప్లింగ్ రేట్, 4400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే SGS లో బ్లూ లైట్, లో ఫ్లిక్కర్ సర్టిఫికేషన్‌లతోపాటు HDR10 ను సపోర్టు చేస్తుంది.
చిప్‌సెట్, OS వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 4nm ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8400 SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 16GB LPDDR5X ర్యామ్ మరియు 512GBB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Origin OS 5 పైన పనిచేస్తుంది.
50MP ప్రైమరీ కెమెరా, 7620mAh భారీ బ్యాటరీ ఫోన్ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చారు. ఈ ఐకూ Z10 టర్బో ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7620mAh బ్యాటరీని కలిగి ఉంది.
* ఐకూ Z10 టర్బో ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఐకూ Z10 టర్బో స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్ తో 6.78 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 3000Hz టచ్ శాంప్లింగ్ రేట్, 4400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే SGS లో బ్లూ లైట్, లో ఫ్లిక్కర్ సర్టిఫికేషన్‌లతోపాటు HDR10 ను సపోర్టు చేస్తుంది.
స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్ :
ఈ ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ LPDDR5X ర్యామ్ మరియు 512GBB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Origin OS 5 పైన పనిచేస్తుంది.
50MP కెమెరా, 7000mAh బ్యాటరీ :
ప్రో మోడల్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ LYT 600 కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. ముందు వైపు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చారు. మరియు 120W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా 5G, డ్యూయల్ 4G VoLTE, బ్లూటూత్ 6.0, వైఫై, GP, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ రెండు మోడల్స్ IP65 రేటింగ్ తో డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెంట్ గా ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంది.
* టర్బో Z10 టర్బో సిరీస్ ధర వివరాలు :
టర్బో Z10 టర్బో స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అక్కడ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 1799 (భారత కరెన్సీ ప్రకారం రూ.21,100), 16GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 1999 (భారత కరెన్సీ ప్రకారం రూ.23400), 12GB ర్యా్మ్ + 512GB స్టోరేజీ ధర CNY 2199, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 2399 గా ఉంది.
ప్రో మోడల్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 1999 (భారత్ కరెన్సీ ప్రకారం రూ.23400) దీంతోపాటు 16GB + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ భారత్ లో విడుదలపై ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు.
* భారత్ మార్కెట్ లో ఈ నెలలో ఐకూ Z10, Z10x 5G ఫోన్‌లు విడుదల అయ్యాయి. Z10 స్మార్ట్‌ఫోన్ 7300mAh బ్యాటరీ. మరో మోడల్ 6500mAh బ్యాటరీతో పనిచేస్తున్నాయి. ఈ రెండు మోడల్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. Z10 మోడల్ ధర సుమారు రూ.20000 గా ఉంది. Z10x మోడల్ ధర రూ.15000 కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చింది.
ఐకూ Z10 స్మార్ట్ ఫోన్ 6.77 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మిలిటరీ గ్రేడ్ MIL STD 810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది.
ఈ ఫోన్ 50MP సోనీ IMX882 OIS ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాలను అమర్చారు. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. IP65 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ తో అందుబాటులోకి వచ్చింది. AI Erase, AI సూపర్ డాక్యుమెంట్, సర్కిల్ టూ సెర్చ్, AI నోట్ అసిస్ట్ ఫీచర్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications