50MP కెమెరా, కర్వడ్ డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కలిగిన 5G ఫోన్‌పై రూ.1500 డిస్కౌంట్!
iQOO Z10R Smartphone : ఐకూ Z10 సిరీస్ నుంచి భారత్ మార్కె్ట్‌లో అనేక మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ సంవత్సరం జులై నెలలో ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ రేంజ్ ధరలో మెరుగైన స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.19,498, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.21,498, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.23,498 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్‌లపై డిస్కౌంట్‌ను అందిస్తోంది.

రూ.1500 డిస్కౌంట్ :
అమెజాన్‌లో SBI క్రెడిట్ కార్డు, ICICI బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.1500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ మూన్‌స్టోన్, అక్వా మెరీన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, SGS సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.77 అంగుళాల కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే Schott Xensation గ్లాస్ ప్రొటెక్షన్‌తో అందుబాటులోకి వచ్చింది.
చిప్‌సెట్, OS వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది.

50MP కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా యాంటీ షేక్ సపోర్టుతో 4K అల్ట్రా క్లియర్ వీడియో ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. మరియు 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది.
దీంతోపాటు వెనుక వైపు Aura లైట్‌ను అమర్చారు. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ వెనుక, ముందు కెమెరాల ద్వారా 30fps వద్ద 4K వీడియోలను రికార్డు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 44W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5700mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, WiFi 6, బ్లూటూత్ 5.4, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు మెరుగైన ఆడియో సపోర్టు కోసం స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








