Home
Mobile

యాంటీ ఫాల్ ప్రొటెక్షన్‌, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌, క్వాడ్ కర్వడ్‌ డిస్‌ప్లే ఫోన్‌పై రూ.2000 డిస్కౌంట్!

iQOO Z10R 5G Smartphone : ఐకూ నుంచి ఇటీవల భారత్ మార్కెట్‌లోకి ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. అయితే ఇప్పటికే బడ్జెట్‌ ధరలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్‌ గత సంవత్సరం విడుదల అయింది. ఈ ఫోన్ అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌, యాంటీ ఫాల్‌ ప్రొటెక్షన్‌, IP68 + IP69 రేటింగ్ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.

ధర వివరాలు :
ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం ఐకూ ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.20,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.22,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24999 గా ఉంది.

iQOO Z10R 5G

రూ.2000 డిస్కౌంట్‌ :
ప్రస్తుతం అమెజాన్‌లో SBI, ICICI బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఫోన్‌ను రూ.18999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ మూన్‌ స్టోన్‌, ఆక్వా మెరీన్ కలర్‌ వేరియంట్స్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉంది.

క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లే :
ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్‌ 6.77 అంగుళాల క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1800 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే Schott xensation గ్లాస్ ప్రొటెక్షన్‌ ను పొందుతోంది.

యాంటీ ఫాల్‌ ప్రొటెక్షన్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ SGS యాంటీ ఫాల్‌ ప్రొటెక్షన్‌, MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ షాక్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. ఈ ఐకూ ఫోన్‌ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. మెరుగైన థర్మల్‌ మేనేజ్‌మెంట్ కోసం కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది.

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్‌ 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP OIS కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్‌ కెమెరాలు 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయి. Aura లైట్‌ను కూడా అమర్చారు.

ఈ ఫోన్ 44W వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5700mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వైఫై 6, బ్లూటూత్‌ 5.4, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. మెరుగైన ఆడియో అవుట్‌పుట్‌ కోసం స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO Z10R 5G Smartphone with anti fall protection feature gets Rs2000 discount on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X