ఇవాళ్టి నుంచే ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్ సేల్.. అమెజాన్‌లో ఈ కార్డులపై రూ.2000 డిస్కౌంట్..!
iQOO Z10R Smartphone sale : ఐకూ Z10 సిరీస్ నుంచి గత వారం ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ రూ.20 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ బెస్ట్ వాటర్ ప్రూఫ్ హ్యాండ్‌సెట్‌గా ఉంది. మరియు కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరా సహా అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. ఇవాళ్టి నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది.
రూ.2000 డిస్కౌంట్ :
ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఐకూ ఇండియా ఇ-స్టోర్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. HDFC, యాక్సెస్ బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.19,499 గా ఉంది.

డిస్కౌంట్ అనంతరం ధర :
8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.21,499, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,499 గా ఉంది. ఈ డిస్కౌంట్ అనంతరం ధరలు వరుసగా రూ.17499, రూ.19499, రూ.21499 గా ఉంటాయి. ఈ హ్యాండ్‌సెట్ మూన్‌స్టోన్, అక్వా మెరీన్ వంటి రెండు కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
డిస్‌ప్లే వివరాలు :
ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. మరియు IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. అంటే బెస్ట్ వాటర్ ప్రూఫ్ ఫోన్‌గా ఉంది. 6.77 అంగుళాల కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. Schott Xensation గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటుంది.

మూడు సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 12GB LPDDR4x ర్యామ్‌తో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తుంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
50MP కెమెరా, Aura లైట్ :
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. ముందు, వెనుక కెమెరాల ద్వారా 30fps వద్ద 4K వీడియోలను రికార్డు చేసే సామర్థ్యాలను కలిగి ఉంది. మరియు వెనుక వైపు Aura లైట్‌ను కూడా అమర్చారు.

ఈ ఫోన్ 44W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5700mAh బ్యాటరీతో పనిచేస్తుంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. 5G, 4G LTE, వైఫై 6, బ్లూటూత్ 5.4, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








