Home
Mobile

iQOO Z10 సిరీస్‌ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌.. చిప్‌సెట్‌, కెమెరా వివరాలు వెల్లడి.. ఎప్పుడు విడుదల కానుందంటే?

iQOO Z10R Smartphone : ఐకూ Z10 సిరీస్‌ నుంచి ఇప్పటికే అనేక ఫోన్లు లాంచ్‌ అయ్యాయి. ఐకూ Z10, ఐకూ Z10x, ఐకూ Z10 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. అయితే త్వరలో ఈ సిరీస్‌ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుంది. ఐకూ Z10R పేరుతో ఈ హ్యాండ్‌సెట్ విడుదల కానుంది. తాజాగా ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. తాజాగా విడుదల అయిన టీజర్‌ ఆధారంగా ఈ ఫోన్ డిజైన్ వెల్లడయింది.

బ్లూ కలర్ వేరియంట్‌ :
ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్ ఇటీవల గీక్‌ బెంచ్‌ లిస్టింగ్‌లో కనిపించింది. ఈ వివరాలను FoneArena వెల్లడించింది. ఈ లిస్టింగ్ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ అనేక వివరాలు వెల్లడయ్యాయి. టీజర్‌ ఆధారంగా ఈ ఫోన్‌ బ్లూ కలర్ ఆప్షన్‌లోనూ అందుబాటులోకి రానుంది.

iQOO Z10R Smartphone teased to launch soon in india

కర్వడ్ అమోలెడ్‌ డిస్‌ప్లే :
ఈ ఫోన్ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలతో అందుబాటులోకి రానుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ కచ్చితమైన విడుదల తేదీ వెల్లడి కాలేదు. అయితే జులై ఆఖరులో లేదా ఆగస్టు తొలి రోజుల్లో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

చిప్‌సెట్ :
ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్‌ టీజర్‌ ఆధారంగా చిప్‌సెట్‌ సహా మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్‌, 12GB ర్యామ్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

కెమెరా విభాగం పరంగా ఐకూ ఫోన్‌ 2x పొర్ట్రెయిట్‌ మోడ్‌ను కలిగి ఉంటుంది. మరియు ముందు, వెనుక కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌ ను కలిగి ఉంటాయి. దీంతోపాటు ఈ ఫోన్ Aura లైట్‌ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఐకూ Z10 లైట్‌ 5G ఫోన్‌ :
గత నెలలో ఐకూ Z10 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ MIL STD 810H, SGS 5 స్టార్‌ యాంటీ ఫాల్‌ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఫోన్ 15W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఈ ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ AI Document Mode, AI Erase, AI Photo Enhance వంటి ఫీచర్లును కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ AI కెమెరా, 2MP కెమెరాలు, 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ ఫోన్ IP64 రేటింగ్‌ తో డస్ట్ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.12999 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO Z10R Smartphone teased to launch soon in india, here are specifications and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X