మంచి వాటర్ ప్రూఫ్, కిందపడినా డ్యామేజీ కానీ స్మార్ట్‌ఫోన్ విడుదల.. 50MP కెమెరా, 5700mAh బ్యాటరీ సహా..!
iQOO Z10R Smartphone Launched : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఐకూ నుంచి భారత్ మార్కెట్‌లోకి ఇవాళ ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఇప్పటికే భారత్ మార్కెట్‌లో ఐకూ Z10, ఐకూ Z10x, ఐకూ Z10 లైట్ ఫోన్‌లు ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, 4K వీడియో రికార్డింగ్ వంటి అనేక ఆకట్టుకొనే ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.
ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.77 అంగుళాల కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే Schott Xensation గ్లాస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

వాటర్ ప్రూఫ్, పొరపాటున కిందపడినా! :
ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఫలితంగా బెస్ట్ వాటర్ ప్రూఫ్ ఫోన్‌గా ఉంటుంది. మరియు MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. దీంతో పొరపాటున కింద పడిన డ్యామేజీ అయ్యేందుకు తక్కువ అవకాశాలు ఉంటాయి.
చిప్‌సెట్ :
ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR4x ర్యామ్‌తో జత చేసి ఉంది. దీంతోపాటు వర్చువల్ ర్యా్మ్ ఫీచర్ ద్వారా 12GB వరకు ర్యామ్‌ను పెంచుకొనే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ రెండు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని ఐకూ వెల్లడించింది. దీంతోపాటు గేమింగ్, మల్టీ టాస్కింగ్ సమయంలో ఈ ఫోన్ థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 13,690mm Sq కూలింగ్ ఏరియాను కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చి ఉంది. ఈ ముందు, వెనుక కెమెరాల ద్వారా 30fps తో 4K వీడియోను రికార్డు చేసేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు Aura లైట్‌ను కూడా కలిగి ఉంది.

బ్యాటరీ :
ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్ 44W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5700mAh బ్యాటరీతో పనిచేస్తుంది. గంటలో పూర్తి ఛార్జింగ్ చేస్తుందని తెలుస్తోంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, వైఫై 6, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.
ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ (iQOO Z10R Smartphone Sale) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,499 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.21,499, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,499 గా ఉంది.
ఈ ఫోన్ సేల్ జులై 29 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఐకూ ఇండియా ఇ-స్టోర్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. HDFC, ICICI బ్యాంకు కార్డులతో రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ అక్వా మెరీన్, మూన్‌స్టోన్ రెండు కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








