Home
Mobile

రూ.13499 ధరకే 6500mAh భారీ బ్యాటరీ, 6.7 అంగుళాల డిస్‌ప్లే, 50MP HD కెమెరా 5G ఫోన్‌ విడుదల..!

ఐకూ Z10 సిరీస్‌ భారత్‌ మార్కెట్‌లో ఇవాళ విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా ఐకూ Z10, ఐకూ Z10x 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఐకూ Z10 హ్యాండ్‌సెట్‌ 7300mAh బ్యాటరీతో లాంచ్ కాగా.. ఐకూ Z10x 5G హ్యాండ్‌సెట్ 6500mAh బ్యాటరీతో (iQOO Z10x 5G Smartphone Launched) అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ కూడా ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

ఐకూ Z10x 5G స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్‌ 6.72 అంగుళాల (1080*2408 పిక్సల్స్) ఫుల్‌ HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్‌, 1050 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 393 ppi పిక్సల్‌ డెన్సిటీని కలిగి ఉంది. TUV Rheinland Eye ప్రొటెక్షన్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. MIL - STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌తో లాంచ్ అయింది.

iQOO Z10x 5G Smartphone Launched

ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 8GB ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో ఆటోఫోకస్‌, f/1.8 అపేచర్‌తో 50MP అల్ట్రా HD ప్రైమరీ కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP బోకేష్‌ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ ఫోన్ 8MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. వెనుక వైపు LED ఫ్లాష్‌, IR బ్లాస్టర్‌ను కలిగి ఉంది.

iQOO Z10x 5G Smartphone Launched

ఈ హ్యాండ్‌సెట్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. AI Erase, AI డాక్యుమెంట్‌, AI ట్రాన్స్‌లేషన్ వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లతోపాటు IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మెరుగైన ఆడియో అవుట్‌పుట్‌ కోసం డ్యూయల్‌ స్పీకర్‌లను కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా బ్లూటూత్‌ 5.4, వైఫై 6, USB-Cను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ యాక్సెలిరోమీటర్‌, యాంబియంట్ లైట్‌ సెన్సార్‌, కలర్ టెంపరేచర్‌ సెన్సార్‌, గైరో స్కో్ప్‌, ఈ- కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్‌ లను అమర్చారు. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

iQOO Z10x 5G Smartphone Launched

ఐకూ Z10x 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
ఐకూ Z10x 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13499, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14999, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.16499 గా ఉంది.

ఏప్రిల్‌ 22 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఐకూ ఇండియా స్టోర్‌, అమెజాన్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. HDFC, ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్‌ అల్ట్రామెరైన్‌, టైటానియం రంగుల్లో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
iQOO Z10x 5G Smartphone Launched with 6500mAh Battery and 50MP primary camera in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X