Home
Mobile

6500mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్‌ డిజైన్‌, 50MP HD కెమెరా 5G ఫోన్.. ధర రూ.13499..!

భారత్‌ మార్కెట్‌లో ఈ నెల 11 వ తేదీన ఐకూ Z10 సిరీస్‌ను లాంచ్‌ చేసింది. ఇందులో భాగంగా 7300mAh భారీ బ్యాటరీతో ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్‌, 6500mAh బ్యాటరీతో ఐకూ Z10x 5G స్మార్ట్‌ఫోన్‌లు (iQOO Z10X Smartphone Sale) అందుబాటులోకి వచ్చాయి. ఐకూ Z10 హ్యాండ్‌సెట్‌ సేల్‌ ఇప్పటికే ప్రారంభం కాగా.. మరో హ్యాండ్‌సెట్ సేల్‌ ఏప్రిల్‌ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌ బడ్జెట్‌ రేంజ్‌లో అందుబాటులో ఉంది.

ఐకూ Z10x 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్ :
ఐకూ Z10x 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13,499, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.16499 గా ఉంది. ICICI, HDFC బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

iQOO Z10x 5G Smartphone sale

ఈ హ్యాండ్‌సెట్‌ సేల్‌ ఏప్రిల్‌ 22 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఐకూ ఇండియా వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్‌ లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఐకూ Z10x 5G స్మార్ట్‌ఫోన్‌ అల్ట్రా మెరైన్‌, టైటానియం వంటి రెండు కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ :
ఐకూ Z10x స్మార్ట్‌ఫోన్‌ MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌తో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌ తో 6.72 అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1080*2408 పిక్సల్స్ రిజల్యూషన్, 1050 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 393 ppi పిక్సల్‌ డెన్సిటీని కలిగి ఉంది.

ఈ ఐకూ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 తో పనిచేస్తుంది. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 8GB ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది.

ఈ హ్యాండ్‌సెట్‌ డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. 50MP అల్ట్రా HD ఆటోఫోకస్‌ ప్రైమరీ కెమెరా, 2MP బోకేష్‌ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ ఫోన్ 8MP కెమెరాను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్‌ LED ఫ్లాష్‌ లైట్‌ను కూడా కలిగి ఉంది.

ఈ ఐకూ ఫోన్‌ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని సంస్థ తెలిపింది. IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ AI ట్రాన్స్‌లేషన్, AI Erase, AI డాక్యుమెంట్‌ వంటి AI (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఫీచర్‌లను కలిగి ఉంది. 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.4, WiFi 6, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. యాక్సెలిరోమీటర్‌, కలర్ టెంపరేచర్‌ సెన్సార్‌, యాంబియంట్ లైట్‌ సెన్సార్‌, గైరో స్కో్ప్‌, ఈ కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్‌ను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. దీంతోపాటు IR బ్లాస్టర్‌ను అమర్చి ఉంటుంది. మెరుగైన ఆడియో అవుట్‌పుట్‌ కోసం డ్యూయల్‌ స్పీకర్‌లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే TUV Rheinland Eye ప్రొటెక్షన్‌ ఫీచర్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO Z10x 5G Smartphone with 6500mAh battery sale to start from april 22 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X