7300mAh, 6500mAh బ్యాటరీలతో iQOO Z10 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు.. విడుదల తేదీ, స్పెసిఫికేషన్‌ల వివరాలు..!
ఐకూ నుంచి భారత్ మార్కెట్‌లో ఏప్రిల్ 11 వ తేదీన ఐకూ Z10 సిరీస్ (iQOO Z10 Series) లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఐకూ Z10 మరియు ఐకూ Z10x ఫోన్‌లు విడుదల కానున్నాయి. అయితే ఐకూ Z10 ఫోన్ గురించి గతంలోనే సంస్థ ప్రకటన చేసింది. ఈ ఫోన్‌ను 7300mAh భారీ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. మరియు మరికొన్ని డిజైన్, కలర్ వేరియంట్ వివరాలను కూడా వెల్లడించింది.
అయితే తాజాగా ఐకూ Z10x స్మార్ట్‌ఫోన్ (iQOO Z10X Smartphone) విడుదలపై కీలక ప్రకటన చేసింది. ఈ ఫోన్‌ను 6500mAh బ్యాటరీతో విడుదల చేస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలిపింది. ఫలితంగా గేమింగ్, మల్టీ టాస్కింగ్ సమయాల్లో మెరుగైన పనితీరు అందిస్తుందని చెబుతోంది.

అమెజాన్ మైక్రోసైట్ ఆధారంగా వివరాలు వెల్లడయ్యాయి. అమెజాన్‌లో ఈ ఫోన్ బ్లూ కలర్ వేరియంట్‌లో టీజ్ చేస్తున్నారు. దీని ఆధారంగా ఈ కెమెరా మాడ్యూల్ డిజైన్, కెమెరాల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు రింగ్ లైట్, LED ఫ్లాష్ యూనిట్ కూడా అమర్చి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అదే ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ (iQOO Z10) స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8.2 లక్షల AnTuTU స్కోర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh బ్యాటరీతో లాంచ్ కానుంది. ఈ ఫోన్ 0-50 శాతం ఛార్జింగ్‌ను కేవలం 33 నిమిషాల్లోనే పూర్తి చేస్తుందని ఐకూ చెబుతోంది.

ఇప్పటికే విడుదల అయిన వివరాలు ఆధారంగా ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ ఏకంగా 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అయితే ఈ ఫోన్ భారీ బ్యాటరీతో లాంచ్ అవుతున్నా.. కేవలం 7.9mm థిక్‌నెస్‌ను మాత్రమే కలిగి ఉంటుందని ఐకూ చెబుతోంది.
ఐకూ Z10 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15, 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చి ఉంటుంది.
ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా విడుదల కానుందని తెలుస్తోంది. మరియు భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, మెరుగైన సౌండ్ అవుట్‌పుట్ కోసం డ్యూయల్ స్పీకర్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.4, వైఫై 6 ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ గ్లేసియర్ సిల్వర్, స్టెల్లర్ బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి వస్తుంది. భారీ బ్యాటరీతో లాంచ్ అవుతున్నా.. 195 గ్రాములు బరువును మాత్రమే కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ధర విషయానికి వస్తే ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ ధర బ్యాంకు ఆఫర్లతో కలిపి సుమారు రూ.20000 గా ఉండే అవకాశం ఉంది. అదే ఐకూ Z10x 5G ఫోన్ ధర రూ.15000 లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ సహా మరిన్ని వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications