7200mAh బ్యాటరీ, 4 సంవత్సరాల అప్‌డేట్స్‌తో 5G స్మార్ట్‌ఫోన్.. బడ్జెట్ ధరలో..!
భారత్ మార్కెట్ లో ఐకూ Z11x 5G స్మార్ట్‌ఫోన్ (iQOO Z11x 5G Smartphone) మార్చి 12 వ తేదీన విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ గురించి ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి. అమెజాన్ (Amazon) ద్వారా ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. అయితే తాజాగా బ్యాటరీ, ప్రాసెసర్, గేమింగ్ ఫీచర్లు, సాఫ్ట్‌వేర్ పాలసీ వివరాలు వెల్లడయ్యాయి.
మీడియాటెక్ ప్రాసెసర్ :
ఐకూ Z11x 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్‌సెట్ ను కలిగి ఉంటుంది. 8GB ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. వర్చువల్ ర్యామ్ ద్వారా 8GB వరకు ర్యామ్ ను పొడిగించుకొనే అవకాశం ఉంది. దీంతోపాటు అనేక గేమింగ్ ఫీచర్లు ఉన్నాయి.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఆండ్రాయిడ్ 16 ఆధారిత Origin OS 6 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ రెండు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుందని సంస్థ తెలిపింది. ఈ ఫోన్ 1 మిలియన్ కు పైగా AnTuTu స్కోర్ ను కలిగి ఉందని తెలిపింది.

7200mAh భారీ బ్యాటరీ, రివర్స్ ఛార్జింగ్ సపోర్టు :
ఐకూ స్మార్ట్‌ఫోన్ 44W ఫ్లాష్ ఛార్జ్ సపోర్టుతో 7200mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ గరిష్ఠంగా 6 సంవత్సరాల వరకు మెరుగైన బ్యాటరీ లైఫ్ ను అందిస్తుందని తెలిపింది. దీంతోపాటు రివర్స్ ఛార్జింగ్ ను కూడా సపోర్టు చేస్తుంది.

AI కెమెరా, 4K వీడియో రికార్డింగ్ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 50MP AI కెమెరా, ముందువైపు 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ రెండు కెమెరాలు 4K వీడియో రికార్డింగ్ ను సపోర్టు చేస్తాయని ఐకూ తెలిపింది. మిగిలిన కెమెరాల వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
డ్యూయల్ స్టీరియో స్పీకర్లు :
ఈ హ్యాండ్‌సెట్ IP68, IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. దీంతోపాటు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ను కలిగి ఉంది. దీంతోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. 400 శాతం ఆడియో బూస్టర్ సపోర్టు కూడా ఉంది.
అయితే ఈ హ్యాండ్‌సెట్ 6.76 అంగుళాల LCD డిస్‌ప్లేతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్ తో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. డిస్‌ప్లే వివరాలపై ఐకూ ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.
ధర వివరాలు లీక్! :
ఐకూ Z11x 5G స్మార్ట్‌ఫోన్ వివరాలను టిప్‌స్టర్ సంజూ ఛౌదరి వెల్లడించారు. ఈ ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్స్ లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.18999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధఱ రూ.20999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22999 గా ఉంటుందని తెలిపారు.


Click it and Unblock the Notifications









