రూ.2000 డిస్కౌంట్‌తో ఇవాళ్టి నుంచే సేల్.. 7200mAh బ్యాటరీ, 50MP కెమెరా, 4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్..!
iQOO Z11x 5G Smartphone Sale : ఐకూ నుంచి భారీ బ్యాటరీ, 50MP కెమెరాలో భారత్ మార్కెట్ లో ఇటీవల ఐకూ Z11x 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ ను అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ సేల్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. తొలి సేల్ లో భాగంగా డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.
ఎక్కడ కొనుగోలు చేయాలి :
ఐకూ Z11x 5G స్మార్ట్‌ఫోన్ ను ఐకూ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్ ( Amazon ) ద్వారా కొనుగోలు చేయవచ్చు. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.20999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22999 గా ఉంది.

రూ.2000 డిస్కౌంట్ :
తొలి సేల్ లో భాగంగా SBI, Axis బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.2000 డిస్కౌంట్ ను పొందవచ్చని ఐకూ తెలిపింది. ఈ ఐకూ హ్యాండ్‌సెట్ టైటాన్ బ్లాక్, ప్రిస్మాటిక్ గ్రీన్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది.
IP68 + IP69 రేటింగ్ :
ఐకూ Z11x 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.76 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 382 ppi పిక్సల్ డెన్సిటిని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP68 + IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది.

ఆండ్రాయిడ్ 16 OS, 4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ 4nm ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.
50MP కెమెరా, 7200mAh బ్యాటరీ :
ఐకూ 5G స్మార్ట్‌ఫోన్ 44W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7200mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 32MP కెమెరా ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఈ ఫోన్ 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఇ-కంపాస్, యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, గైరోస్కోప్ సెన్సర్ లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








