7200mAh బ్యాటరీ, 50MP కెమెరా, 4 సంవత్సరాల అప్‌డేట్స్‌తో స్మార్ట్‌ఫోన్ విడుదల.. రూ.2000 డిస్కౌంట్!
ఐకూ సంస్థ భారత్ మార్కెట్‌లో ఐకూ Z11x 5G (iQOO Z11x 5G Smartphone) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ బడ్జెట్ ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఐకూ ఫోన్ 7200mAh బ్యాటరీ, 50MP కెమెరాను కలిగి ఉంది. డిజైన్ పరంగానూ ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది. తొలిసేల్‌లో భాగంగా రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చని తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.
ఐకూ Z11x 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ హ్యాండ్‌సెట్ 6.76 అంగుళాల (1080 x 2344 పిక్సల్స్) LCD డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 382 ppi పిక్సల్ డెన్సిటిని కలిగి ఉంది. టైటాన్ బ్లాక్, ప్రిస్మాటిక్ గ్రీన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్ 4nm ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్ ను కలిగి ఉంది. ఈ చిప్ 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని ఐకూ హామీ ఇచ్చింది.
50MP కెమెరా, 7200mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP బొకేష్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చారు. 44W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7200mAh బ్యాటరీని కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, వైఫై, GPS, QZSS, BeiDou, GLONASS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సర్, ఇ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సర్, గైరోస్కోప్ వంటి సెన్సర్‌లు ఉన్నాయి. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.
ఐకూ Z11x 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ :
ఈ హ్యాండ్‌సెట్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.18999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.20999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.22999 గా ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ సేల్ మార్చి 16 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. తొలి సేల్‌లో భాగంగా SBI క్రెడిట్ కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








