ఐకూ నుంచి మరో స్మార్ట్‌ఫోన్.. మీడియాటెక్ చిప్‌సెట్, భారీ బ్యాటరీ సహా కీలక వివరాలు లీక్..!
భారత్ మార్కెట్ లో ఐకూ నుంచి గత నెలలో ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్, 7600mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ సేల్ మార్చి 3 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు. అయితే త్వరలో ఐకూ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. విడుదల తేదీ వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు.
ఎప్పుడు విడుదల కానుంది? :
ఈ ఫోన్ ఐకూ Z11x పేరుతో (iQOO Z11x Smartphone) భారత్ లో అందుబాటులోకి రానుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ విడుదల వివరాలు సహా అనేక వివరాలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ సంజు ఛౌదరి ఈ వివరాలను లీక్ చేశారు. ఈ ఫోన్ మార్చి 12 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుందని తెలిపారు.

ఈ ఫోన్ భారత్ లో ఐకూ ఇండియా వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్ (Amazon) ద్వారా అందుబాటులోకి వస్తాయిని తెలిపారు. అమెజాన్ లో ఐకూ Z11x స్మార్ట్‌ఫోన్ కు సంబంధించి మైక్రోసైట్ ప్రారంభం అయింది. అయితే ఐకూ మాత్రం విడుదల తేదీపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
భారత్ మార్కెట్ లో ఐకూ Z11x 5G స్మార్ట్‌ఫోన్ రూ.20,000 కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే అమెజాన్ మైక్రోసైట్ ఆధారంగా కొన్ని స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు వెల్లడయ్యాయి.
Exclusive 💫
— Sanju Choudhary (@saaaanjjjuuu) February 27, 2026
iQOO Z11x to launch on 12th March:
• 6.76" 120Hz LCD display
• MTK 7400 Turbo
• UFS 3.1
• 7200mAh + 44W
• 50MP Sony Main
• 32MP front
• IP68/69
• upto 8/256GB
Guess the price! pic.twitter.com/wOgoD9Tldd
మీడియాటెక్ చిప్‌సెట్ :
ఐకూ Z11x స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్ 8GB ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. అయితే ఈ ఫోన్ 44W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7200mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది.
అంచనా స్పెసిఫికేషన్లు :
ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.76 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Origin OS 6 పైన పనిచేస్తుంది. అయితే ఆండ్రాయిడ్ OS, సెక్యూరిటీ అప్‌డేట్స్ గురించి తెలియాల్సి ఉంది.
50MP ప్రైమరీ, 32MP సెల్ఫీ కెమెరాలు! :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయి. ఇందులో 50MP ప్రైమరీ లెన్స్‌తోపాటు మరో కెమెరా కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, విడుదల తేదీపై ఐకూ ఇండియా (iQOO India) ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే త్వరలో అధికారికంగా విడుదల తేదీ సహా ఇతర వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications








