Home
Mobile

ఐక్యూ Z7 5G ఇండియా లో లాంచ్ అయింది. సేల్ ఈ రోజే...! ధర, స్పెసిఫికేషన్లు

By Maheswara

ఐక్యూ Z7 5G భారతదేశంలో మార్చి 21, మంగళవారం అంటే ఈ రోజు లాంచ్ చేయబడింది. ఐక్యూ Z7 5G అనేది భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బ్రాండ్ యొక్క మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ అని పేర్కొంది.దీని పోటీ క్యాటగిరీ లోని ఫోన్లకంటే కొనుగోలుదారులకు ఉత్తమ ఇన్ క్లాస్ హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ ఫీచర్లను అందించడానికి ఈ ఫోన్ తయారుచేయబడింది.

ఈ స్మార్ట్ ఫోన్ AnTuTu స్కోర్ 4,85,000+ పాయింట్ లను సాధించింది అని కంపెనీ ప్రకటించింది. ఇది రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో మార్కెట్లోకి లాంచ్ చేయబడింది. ఈ iQoo Z7 5G స్మార్ట్ ఫోన్ ఈ రోజు మధ్యాహ్నం 1:00 IST నుండి అమెజాన్ మరియు iQoo e-స్టోర్ ద్వారా సేల్ చేయబడుతుంది.

iQoo Z7 5G With MediaTek Dimensity 920 Soc, 64MP Camera, 44W Fast Charging Launched In India. Price Details

భారతదేశంలో ఐక్యూ Z7 5G ధర, లభ్యత వివరాలు గమనిస్తే, ఈ ఫోన్ రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ లలో వస్తుంది. ఐక్యూ Z7 5G యొక్క తక్కువ వేరియంట్ భారతదేశంలో రూ. 18,999, అయితే 8GB వేరియంట్ రూ. 19,999 గా ఉంది.వీటిపై ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్‌ల ధర 6GB + 128GB మోడల్‌కు రూ.17,499 మరియు 8GB + 128GB మోడల్ కోసం రూ.18,499 గా ఉంది.

ఐక్యూ ద్వారా కొత్తగా లాంచ్ చేయబడిన ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో అమెజాన్ మరియు ఐక్యూ ఇ-స్టోర్ ద్వారా నార్వే బ్లూ మరియు పసిఫిక్ నైట్ అనే రెండు కలర్ వేరియంట్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఈరోజు, మార్చి 21, IST మధ్యాహ్నం 1 గంట నుండి అమ్మకానికి ప్రారంభమవుతుంది.

iQoo Z7 5G With MediaTek Dimensity 920 Soc, 64MP Camera, 44W Fast Charging Launched In India. Price Details

ఐక్యూ Z7 5G స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్ల వివరాలు, ఈ ఫోన్ డ్యూయల్ నానో SIM-సపోర్ట్ ఉన్న స్మార్ట్‌ఫోన్, ఇది 6.38 అంగుళాల పూర్తి HD+ (2400 x 1080) రిజల్యూషన్ అమోలెడ్ డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్ మరియు సర్దుబాటు చేయగల టచ్ శాంప్లింగ్ రేట్ 360Hz వరకు ఉంటుంది. కెపాసిటివ్ మల్టీ టచ్ ఫీచర్‌తో, దీని డిస్‌ప్లే 412ppi పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది.

ఇక సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే, ఇది ఫన్ టచ్ OS 13 అవుట్ ఆఫ్ ది బాక్స్‌ ఫీచర్ తో వస్తుంది. ఇంకా 8GB వరకు LPDDR4X RAMతో పాటు, Mali G68 GPUతో పాటు ఆక్టా-కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 920 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.

ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, ఐక్యూ Z7 5G లో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా డిస్ప్లే ఎగువన కేంద్రీకృత రంధ్రం పంచ్ కటౌట్‌లో ఉంచబడింది. పోర్ట్రెయిట్, బోకె మరియు నైట్ మోడ్‌లతో పాటు, వెనుక కెమెరా సిస్టమ్ సెకనుకు 30 ఫ్రేమ్‌ల (fps) వద్ద 4కె క్వాలిటీ వీడియోలను రికార్డ్ చేయగలదని సమాచారం.

ఐక్యూ యొక్క Z7 5G యొక్క ఇతర ఫీచర్లు, UFS 2.2 అంతర్గత నిల్వ 128GB, హైబ్రిడ్ స్లాట్‌లో మద్దతు ఉన్న మైక్రో-SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ 44W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్‌తో 4,500mAh Li-ion బ్యాటరీని కలిగి ఉంటుంది. ఫోన్ వైఫై 6, బ్లూటూత్ v5.2 మరియు GPS కనెక్టివిటీ ఎంపికలను కూడా అందిస్తుంది. పరికరం 3.5mm ఆడియో జాక్ మరియు USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తుంది. 173 గ్రాముల బరువు, iQoo Z7 5G యొక్క ప్లాస్టిక్ బాడీ 158.91mm x 73.53mm x 7.80mm పరిమాణంలో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQoo Z7 5G With MediaTek Dimensity 920 Soc, 64MP Camera, 44W Fast Charging Launched In India. Price Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X