Home
Mobile

iQOO కొత్త 5G ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు

By Maheswara

iQOO Z7s 5G భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేయబడింది. iQOO Z7s ఫోన్ మధ్య శ్రేణి 5G ఫోన్‌గా లాంచ్ అయింది, మరియు ఇది iQOO Z7 5G రాకను అనుసరిస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర,స్పెసిఫికేషన్లు మరియు ఇతర వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ iQOO Z7 5G లోఉన్న మీడియా టెక్ SoC ప్రాసెసర్ కి విరుద్ధంగా స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ అమోలెడ్ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, తాజా సాఫ్ట్‌వేర్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది.

iQoo Z7s 5G Smartphone With Snapdragon 695 Processor,64MP Camera Launched In India. Details Here.

భారతదేశంలో iQOO Z7s 5G ధర వివరాలు,
భారతదేశంలో iQOO Z7s ధర బేస్ 6GB/128GB మోడల్‌కు రూ. 18,999 గా సెట్ చేయబడింది, అయితే 8GB/128GB వేరియంట్ ధర రూ. 19,999 కి నిర్ణయించారు. iQOO Z7s 5G కంపెనీ అధికారిక వెబ్‌సైట్ మరియు అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

అయితే, ప్రస్తుతం ముందు తరం ఫోన్ అయిన IQOO Z7 5G అమెజాన్ మరియు iQOO వెబ్‌సైట్ రెండింటిలోనూ స్టాక్‌లో లేనందున, దీనికి MediaTek డైమెన్సిటీ 920 చిప్‌ల కొరత కారణం అవ్వొచ్చని అంచనా వేయవచ్చు.

iQoo Z7s 5G Smartphone With Snapdragon 695 Processor,64MP Camera Launched In India. Details Here.

iQOO Z7s 5G స్పెసిఫికేషన్‌ల వివరాలు
iQOO Z7s 5G ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 SoC ప్రాసెసర్ ద్వారా 8GB వరకు LPDDR4x RAM మరియు 128GB UFS 2.2 స్టోరేజ్‌తో జత చేయబడింది. అదనంగా, 8GB వరకు ఉపయోగించని స్టోరేజీ ని అదనపు RAMగా ఉపయోగించవచ్చు. iQOO Z7s 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13 పై ఫన్ టచ్ OS 13 స్కిన్‌తో రన్ అవుతుంది.

అంతేకాకుండా, iQOO Z7s 5G ఫోన్ కు రెండు సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు మరియు మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా వాగ్దానం చేస్తుంది. iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ 6.38 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను 1,300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. ఈ ప్యానెల్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది.

ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాలను గమనిస్తే, iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ OIS మద్దతుతో 64 MP f/1.79 ISOCELL GW3 ప్రైమరీ సెన్సార్ మరియు 2 MP డెప్త్ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. మరియు, ముందు వైపు 16 MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.

iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500 mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. ఈ iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ నార్వే బ్లూ మరియు పసిఫిక్ నైట్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది

More from GizBot

Best Mobiles in India

English summary
iQoo Z7s 5G Smartphone With Snapdragon 695 Processor,64MP Camera Launched In India. Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X