Home
Mobile

8GB ర్యామ్‌, 6000mAh బ్యాటరీతో ఐకూ కొత్త స్మార్ట్‌ఫోన్‌.. లాంచ్‌ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు..!

ఐకూ (iQOO India) నుంచి కొత్త ఫోన్‌ త్వరలో భారత్‌ మార్కెట్‌లోకి రానుంది. ఐకూ Z9 5G స్మార్ట్‌ఫోన్‌ను (iQOO Z9 5G) మార్చి నెలలో విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటన చేసింది. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్, మరియు ఐకూ ఇండియా వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ గత సంవత్సరం విడుదలైన ఐకూ Z7 5G స్మార్ట్‌ ఫోన్‌కు తర్వాత తరం హ్యాండ్‌సెట్‌గా రానుంది.

ఐకూ ఇండియా సీఈవో నిపున్‌ మార్యా ఐకూ Z9 5G స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్‌ వివరాలను వెల్లడించారు. ఈ ఫోన్‌ మార్చి 12న భారత్‌లో లాంచ్‌ కానుంది. ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్లను సంస్థ ధ్రువీకరించింది. ఐకూ ఇండియా, అమెజాన్‌ పేజీల ఆధారంగా ఈ ఫోన్‌ డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది.

iQOO Z9 5G smartphone launch date confirmed

ఐకూ Z9 5G స్మార్ట్‌ ఫోన్‌ ఇప్పటికే గీక్‌బెంచ్‌లో కనిపించింది. దీని ఆధారంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ 8GB ర్యామ్‌ మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది. మరియు OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) ఫీచర్‌ సహా సోనీ IMX882 కెమెరాలను కలిగి ఉంటుంది.

ఐకూ Z9 5G స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 SoC చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుంది. ఈ సెగ్మెంట్‌లో ఇటువంటి చిప్‌ను కలిగి ఉన్న తొలి స్మార్ట్‌ ఫోన్‌ ఇదేనని ఐకూ తెలిపింది. మరియు గీక్‌బెంచ్‌ ఆధారంగా పలు పరీక్షల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ మెరుగైన పనితీరును కనబరిచినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే లీక్‌ అయిన కొన్ని వివరాల ఆధారంగా ఐకూ కొత్త స్మార్ట్‌ ఫోన్‌ 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ స్పెసిఫికేషన్ల ఆధారంగా ఈ ఐకూ Z9 5G స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.25000 కంటే తక్కువకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

గత సంవత్సరం లాంచ్‌ అయిన ఐకూ Z7 5G స్మార్ట్‌ ఫోన్ తర్వాత తరం స్మార్ట్‌ఫోన్‌గా ఐకూ Z9 5G విడుదల అవుతోంది. ఐకూ Z7 5G హ్యాండ్‌సెట్ 6GB ర్యామ్‌ +128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ కంటే మరిన్ని మెరుగైన ఫీచర్లను కొత్త ఐకూ ఫోన్‌ కలిగి ఉండే అవకాశం ఉంది.

అయితే ఐకూ Z9 5G స్మార్ట్‌ ఫోన్‌ మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి అయ్యే అవకాశం ఉంది. ర్యామ్‌, స్టోరేజీ, OS, కెమెరా స్పెసిఫికేషన్ల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మరియు డిస్‌ప్లే సహా ఇతర కీలక ఫీచర్లను సమాచారం వెల్లడి కాలేదు. విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
iQOO Z9 5G smartphone will be launched on March 12 in india here are the conformed specs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X