iQOO Z9 5G ఇండియాలో లాంచ్ అయింది...ఈ రోజే! సేల్, ధర మరియు ఆఫర్ల వివరాలు
iQOO సంస్థ ఈ రోజు భారత్ మార్కెట్లో iQOO Z9 5G ని లాంచ్ చేసింది. ఇది Z సిరీస్‌లో కంపెనీ యొక్క తాజా స్మార్ట్‌ఫోన్ మరియు భారతదేశంలో గత సంవత్సరం లో లాంచ్ అయిన iQOO Z7 కు కొనసాగింపుగా వస్తుంది.
iQOO Z9 5G స్పెసిఫికేషన్ల వివరాలు
ఈ ఫోన్ 6.67-అంగుళాల FHD+ అమోలెడ్ స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 1800 nits గరిష్ట ప్రకాశం మరియు పంచ్-హోల్ లోపల 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

ఇది డైమెన్సిటీ 7200 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది, ఈ ధర విభాగంలో ఈ ప్రాసెసర్ తో వచ్చే మొదటి ఫోన్ ఇదే. 8GB వర్చ్యువల్ RAMతో 8GB RAM ఉంది.128GB / 256GB (UFS 2.2) స్టోరేజీ ఆప్షన్లలో వస్తుంది. మైక్రో SD కార్డుతో 1TB వరకు స్టోరేజీ ని పెంచుకోవచ్చు. హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ (నానో + నానో / మైక్రో SD) స్లాట్ కలిగి ఉంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Funtouch OS 14 పై పనిచేస్తుంది. మరియు కంపెనీ 2 సంవత్సరాల OS అప్డేట్ లను మరియు మూడు సంవత్సరాల వరకు నెలవారీ భద్రతా ప్యాచ్‌లను వాగ్దానం చేసింది.
ఇది పోర్ట్రెయిట్ ఫోటోల కోసం 2MP డెప్త్ సెన్సార్‌తో పాటు సోనీ IMX882 సెన్సార్, OIS + EISతో కూడిన 50MP వెనుక కెమెరాను కలిగి ఉంది ఇది 4K 30fps వీడియో రికార్డింగ్, LED ఫ్లాష్ కలిగి ఉంది. f/2.0 ఎపర్చర్‌తో 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1080p వీడియో రికార్డింగ్ చేయగలదు.
కనెక్టివిటీ ఫీచర్లలో 5G (n1/n3/n5/n8/n28B/n40/n77/n78 బ్యాండ్‌లు), డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6 802.11 ax (2.4GHz + 5GHz), బ్లూటూత్ 5.3, GPS/ GLONASS/ Beidou ఉన్నాయి. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఈ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్‌తో ప్లాస్టిక్ బ్యాక్‌ను కలిగి ఉంది, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. దుమ్ము మరియు స్ప్లాష్ రెసిస్టెంట్ (IP54) రేటింగ్ తో వస్తుంది. 163.17×75.81×7.83mm కొలతలతో 188గ్రా బరువు ఉంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
ధర మరియు లభ్యత వివరాలు
iQOO Z9 5G స్మార్ట్ ఫోన్ గ్రాఫీన్ బ్లూ మరియు బ్రష్డ్ గ్రీన్ రంగులలో వస్తుంది మరియు దీని ధర 8GB + 128GB మోడల్‌కు రూ.19,999 మరియు 8GB + 256GB మోడల్ ధర రూ. 21,999 గా లాంచ్ అయింది.
Amazon.in మరియు iQOO.com నుండి ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు మార్చి 13న మధ్యాహ్నం 12 గంటలకు ముందస్తు యాక్సెస్ సేల్ ఉంది మరియు ఇతరులకు మార్చి 14న మధ్యాహ్నం 12 గంటలకు ఓపెన్ సేల్ ప్రారంభమవుతుంది.
ఇక ఆఫర్ల వివరాలు గమనిస్తే, ICICI/HDFC కార్డ్‌ల వినియోగదారులకు ఫ్లాట్ రూ. 2000 తక్షణ తగ్గింపు ఆఫర్ ఉంది.అలాగే 3 నెలల వరకు నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంది.


Click it and Unblock the Notifications








