Home
Mobile

ధర రూ.12000 కంటే తక్కువ ధరలో ఐకూ 5G స్మార్ట్‌ఫోన్‌... స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!

ఐకూ నుంచి త్వరలో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. ఐకూ Z సిరీస్‌లో ఎంట్రీ లెవల్‌ ధర సెగ్మెంట్‌ లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఐకూ Z9 5G, ఐకూ Z9x 5G స్మార్ట్‌ఫోన్‌ లు ఇటీవలే అందుబాటులోకి వచ్చాయి. టిప్‌స్టర్‌ ముకుల్‌ శర్మ వివరాలు ఆధారంగా జులై నెలలో ఐకూ Z9 లైట్‌ స్మార్ట్‌ ఫోన్ (iQOO Z9 lite 5G Smartphone) లాంచ్‌ కానుంది. X (ట్విట్టర్‌) పోస్టు ద్వారా కీలక వివరాలను వెల్లడించారు.

దీంతోపాటు మరో టిప్‌ స్టర్‌ సంజు చౌదరి వివరాల ఆధారంగా జులై నెల మధ్యలో ఈ ఐకూ Z9 లైట్‌ స్మార్ట్‌ ఫోన్‌ విడుదలయ్యే అవకాశం ఉందని తెలి పారు. దీంతోపాటు ఈ హ్యాండ్‌ సెట్ ఇప్పటికే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ (BIS) సర్టిఫికేషన్‌ ను పొందింది.

iQOO z9 lite 5G will come in entry level smartphone and may launch in july in india

ఈ ఐకూ Z9 లైట్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఎంట్రీ లెవల్‌ ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌ గా విడుదల కానుందని తెలుస్తోంది. మరియు ఈ హ్యాండ్‌ సెట్‌ బ్రౌన్‌, బ్లూ రంగుల్లో లభిస్తుంది. కొన్ని లీక్‌ల ఆధారంగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ వివో T3 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా రానుందని తెలుస్తోంది.

కొన్ని లీక్‌ల ఆధారంగా ఐకూ Z9 లైట్‌ స్మార్ట్‌ ఫోన్‌ రూ.12 వేల కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరియు LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు మీడియాటెక్‌ 6 సిరీస్‌ ప్రాసెసర్‌ పైన పనిచేసే అవకాశం ఉందని సమాచారం.

వివో T3 లైట్‌ స్మార్ట్‌ ఫోన్‌ జూన్‌ 27న భారత్‌ మార్కెట్‌ లో విడుదల కానుంది. సంస్థ షేర్‌ చేసిన ఫోటో ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ స్లాబ్‌ తరహా డిజైన్‌ను కలిగి ఉంది. మరియు ఫ్లాట్‌ స్క్రీన్‌ తో రానుంది. దీర్ఘచతురస్రాకార (Rectangular) కెమెరా మాడ్యుల్‌ తో డ్యూయల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. 50MP AI ప్రధాన కెమెరా సహా 2MP కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది.

** వివో T3 లైట్‌ స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌ సెట్‌ పైన పనిచేసే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ వివో కొత్త ఫోన్‌ ధర రూ.12000 కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
iQOO z9 lite 5G smartphone expected to launch in mid july in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X