Home
Mobile

రూ.10,000 కంటే తక్కువ ధరలో 50MP కెమెరా, 128GB స్టోరేజీతో 5G స్మార్ట్‌ఫోన్‌.. విడుదల తేదీ వెల్లడి..!

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ ఐకూ నుంచి భారత్‌ మార్కెట్‌ లోకి త్వరలో కొత్త హ్యాండ్‌ సెట్ విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఐకూ Z9 లైట్‌ 5G (iQOO Z9 Lite 5G Smartphone) ఎంట్రీ లెవల్‌ ధరలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ హ్యాండ్‌ సెట్‌ విడుదల తేదీ వెల్లడైంది. ఐకూ ఇండియా సీఈవో నిపున్‌ మార్యా హ్యాండ్‌సెట్‌ విడుదల తేదీని X వేదికగా వెల్లడించారు. అయితే ఎటువంటి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు వివరాలను అధికారికంగా వెల్లడించలేదు.

ఐకూ Z9 లైట్‌ 5G స్మార్ట్‌ ఫోన్‌ జులై 15న భారత్‌లో విడుదల కానుంది. బ్రౌన్‌, బ్లూ రంగుల్లో లభిస్తుంది. రూ.10000 కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫోటోల ఆధారంగా ఈ హ్యాండ్‌ సెట్‌ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది.

iQOO Z9 Lite 5G Smartphone launch Date

ఐకూ Z9 లైట్ 5G స్మార్ట్‌ ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు! :
ఐకూ Z9 లైట్ 5G స్మార్ట్‌ ఫోన్‌ 6.56 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 90Hz రీఫ్రెష్‌ రేట్‌ సహా 900 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.

ఈ ఐకూ ఎంట్రీ లెవల్‌ 5G స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌ సెట్‌ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో రానుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకొనే వీలుంది.

iQOO Z9 Lite 5G Smartphone launch Date

ఐకూ Z9 లైట్‌ 5G స్మార్ట్‌ ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉండనుంది. అదే విధంగా సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ హ్యాండ్‌ సెట్‌ 16MP కెమెరాను కలిగి ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్ 15W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉండనుంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా 5G, వైఫై, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంటుంది. కొన్ని నివేదికల ఆధారంగా ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.10,000 కంటే తక్కువకే అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO Z9 Lite 5G Smartphone launch Date confirmed in india with Starting Price under RS 10000
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X