ఐకూ Z9 స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు లీక్.. 8GB ర్యామ్, 50MP కెమెరా సహా కీలక ఫీచర్లు..!
ఐకూ సంస్థ తమ కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఐకూ Z9 (iQOO Z9 Smartphone) ను మార్చి 12న భారత్ మార్కెట్‌లో విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన అనేక స్పెసిఫికేషన్లు, కెమెరా వివరాలను సంస్థ ఇప్పటికే వెల్లడించింది. తాజాగా ఈ ఫోన్ రెండు వేరియంట్ల ధర వివరాలు తాజాగా లీక్ అయ్యాయి.
ఐకూ Z9 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు :
ఐకూ Z9 స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్ సహా 1800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్, జీపీఎస్ మరియు USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది.

ఫన్‌టచ్OS సహా 5000mAh బ్యాటరీ :
ఈ ఐకూ Z9 హ్యాండ్ సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత FuntouchOS పైన పనిచేస్తుంది. మరియు ఈ ఐకూ కొత్త స్మార్ట్ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
50MP ప్రైమరీ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా : ఈ ఐకూ కొత్త స్మార్ట్ ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో భాగంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 16MP కెమెరాను కలిగి ఉంటుంది.
ఐకూ z9 స్మార్ట్ ఫోన్ వేరియంట్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి : ఐకూ Z9 స్మార్ట్ ఫోన్ (iQOO Z9 Smartphone price leaks) 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,999 గా ఉంటుందని తెలుస్తోంది.
అదే విధంగా 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ మోడల్ ధర రూ.19,999 గా ఉంటుందని సమాచారం. సేల్‌లో భాగంగా బ్యాంకు ఆఫర్ల ద్వారా ఐకూ z9 స్మార్ట్ ఫోన్‌ను మరింత తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ఈ ఐకూ Z9 స్మార్ట్ ఫోన్ మార్చి 12వ తేదీన భారత్ మార్కెట్‌లో విడుదల కానుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ చాలా స్పెసిఫికేషన్ల వివరాలను సంస్థ ధ్రువీకరించింది. విడుదల రోజున పూర్తి స్థాయి వివరాలు వెల్లడికానున్నాయి. ఈ ఫోన్ ధర గరిష్ఠ కూడా రూ.20000 కంటే తక్కువగా ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








