5500mAh బ్యాటరీ, 50MP కెమెరా, 6.77 అంగుళాల డిస్‌ప్లేతో iQOO స్మార్ట్‌ఫోన్.. ఆగస్టు 21 న విడుదల..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఐకూ నుంచి ఆగస్టు 21 వ తేదీన ఐకూ Z9s ప్రో హ్యాండ్‌సెట్ (iQOO Z9s Pro Smartphone) విడుదల కానుంది. ఇప్పటికీ ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు కొన్ని విడుదల అయ్యాయి. వినియోగదారుల అనుభూతిని మెరుగుపరిచేందుకు వీలుగా ఈ హ్యాండ్‌సెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 5500mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉందని సమాచారం. ఐకూ ఇండియా అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ ద్వారా సేల్ నిర్వహించనున్నారు.
ఐకూ Z9s ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఐకూ Z9s ప్రో స్మార్ట్‌ఫోన్ (iQOO Upcoming Smartphone) 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.77 అంగుళాల 3D కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ తో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

గేమింగ్ టాస్క్‌ల కోసం కూలింగ్ ఛాంబర్ :
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ తో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గరిష్ఠంగా 12GB ర్యామ్, 256GB స్టోరేజీ వేరియంట్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫోన్ గేమింగ్ సమయంలో ఎటువంటి సమస్యలు రాకుండా వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంటుంది.
3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు :
ఈ ఐకూ Z9s స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత FuntouchOS 14 పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 2 ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని తెలుస్తోంది. IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి రానుంది.

50MP + 8MP కెమెరాలు ! :
ఈ ఐకూ ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఫీచర్‌తో 50MP సోనీ IMX882 కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 4K వీడియో సామర్థ్యం సహా OIS ఫీచర్‌తో 8MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 2X డిజిటల్ జూమ్, పొర్ట్రెయిట్, సూపర్ నైట్ మోడ్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
80W ఫాస్ట్ ఛార్జింగ్, 5500mAh బ్యాటరీ :
ఈ ఐకూ హ్యాండ్‌సెట్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. ధర విషయానికి వస్తే రూ.25000 సెగ్మెంట్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఐకూ ఇండియా అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉండనుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








