iQoo Z9s Series ఐకూ Z9s సిరీస్ స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు లీక్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఐకూ నుంచి ఆగస్టు 21 ఐకూ Z9s సిరీస్ స్మార్ట్‌ఫోన్ లు (iQoo Z9s Series Smartphone) లాంచ్ కానున్నాయి. ఈ సిరీస్ లో భాగంగా Z9s మరియు Z9s ప్రో మోడళ్లు విడుదల కానున్నాయి. ఈ హ్యాండ్ సెట్‌ల స్పెసిఫికేషన్ లు సహా ఇతర వివరాలను సంస్థ వెల్లడించింది. తాజాగా ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్ ల ధర వివరాలు వెల్లడయ్యాయి. రెండు రంగుల్లో ఈ హ్యాండ్‌సెట్ విడుదల కానుందని తెలుస్తోంది. మరియు ప్రో మోడల్ 3D కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలిపింది.
ఐకూ Z9s సిరీస్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఐకూ Z9s స్మార్ట్‌ఫోన్ 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే 1800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండనుంది. ఈ ఐకూ Z9s సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఏఐ ఫోటో మరియు ఏఐ ఎరేజ్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

అదే ప్రో మోడల్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలిపింది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. మరియు స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఛార్జింగ్ మరియు బ్యాటరీ పరంగా 5500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
ఐకూ Z9s మరియు ఐకూ Z9s ప్రో స్మార్ట్‌ఫోన్‌లు OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX 882 కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా నైట్ మోడ్, 4K నాణ్యతతో వీడియో వీడియోలను రికార్డు చేయవచ్చు. ఈ ఫోన్ 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాతో అందుబాటులోకి రానుంది.
ఈ హ్యాండ్‌సెట్ ధర భారత్ మార్కెట్‌లో రూ.25000 రేంజ్‌లో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ స్టోరేజీ వివరాలు తెలియాల్సి ఉంది. మరియు డిస్‌ప్లే సైజు సహా ఎంత ఛార్జింగ్ సామర్థ్యంతో అందుబాటులోకి రానుందో వెల్లడి కావాల్సి ఉంది. ఈ ప్రో మోడల్ ఫ్లాంబోయంట్ ఒరాగ్నే, లక్స్ మార్బుల్ రంగుల్లో లభిస్తుంది.
జులై నెలలో ఐకూ Z9 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. 6.56 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్ రేట్, 840 నిట్స్ గరిష్ఠ డిస్‌ప్లే తో అందుబాటులో ఉంది. ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 4GB /6GB LPDDR4X ర్యామ్, 128GB eMMC 5.1 స్టోరేజీతో జతచేయబడుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS ను కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ కెమెరాను కలిగి ఉంటుంది. 2MP డెప్త్ సెన్సార్ ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంటుంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








