ఐకూ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్.. పోస్టర్ షేర్ చేసిన సంస్థ సీఈవో.. పూర్తి వివరాలు..!
ఐకూ నుంచి ఇటీవల Z9 లైట్ స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. అయితే త్వరలో మరో హ్యాండ్‌సెట్ భారత్ మార్కెట్‌లోకి విడుదల కానుందని తెలుస్తోంది. ఐకూ సీఈవో నిపున్ మార్యా ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఐకూ Z9s సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు (iQOO Z9s Series Smartphones) సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతైన ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే త్వరలో రానున్న స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఐకూ Z9 టర్బో హ్యాండ్‌సెట్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా రానుందని తెలుస్తోంది.
ఈ పోస్టర్ ఆధారంగా ఐకూ Z9s సిరీస్ స్మార్ట్‌ఫోన్ బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు వెనుకవైపు కెమెరా డిజైన్‌ను గుర్తించవచ్చు. ఇందులో డ్యూయల్ కెమెరాలు సహా లైట్ రింగ్‌ను గమనించవచ్చు. అయితే ఈ ఫోన్ నాణ్యమైన కెమెరాను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎటువంటి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలను సంస్థ వెల్లడించలేదు. ఆగస్టు నెలలో ఈ హ్యాండ్‌సెట్ విడుదల కానుంది.

అయితే ఈ హ్యాండ్‌సెట్ ఐకూ Z9 టర్బో స్మార్ట్‌ఫోన్ రీబ్రాండ్ వెర్షన్‌గా అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. టర్బో హ్యాండ్‌సెట్ ఆక్టా కోర్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తోంది. దీంతోపాటు ఈ ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 1.5k OLED ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
*ఇటీవల భారత్ మార్కెట్‌లోకి వచ్చిన ఐకూ Z9 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G మొబైల్ ప్రాసెసర్ ను కలిగి ఉంది. 128GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడుతుంది. మరియు 4GB లేదా 6GB తో జతచేయబడింది.
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రధాన కెమెరా సహా 2MP బోకేష్ లెన్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. వెనుక కెమెరాలు నైట్, పొర్ట్రెయిట్, పనోరమా, టైమ్ ల్యాప్స్ వంటి ఫీచర్‌లను కలిగి ఉన్నాయి.
ఐకూ Z9 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.10499 గా ఉంది. అదే 6GB + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11499 గా ఉంది. బ్యాంకు ఆఫర్లతో ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ వేరియంట్‌ను రూ.9999 కే సొంతం చేసుకోవచ్చు. ఐకూ స్టోర్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








