6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో ఐకూ 5G స్మార్ట్‌ఫోన్.. భారత్‌లో విడుదల తేదీ ఖరారు..!!
ఐకూ నుంచి కొత్త హ్యాండ్‌సెట్ భారత్ మార్కెట్‌లోకి విడుదల కానుంది. ఈ మేరకు సంస్థ వెల్లడించింది. ఐకూ Z9X 5G (iQOO Z9X 5G Smartphone) స్మార్ట్‌ఫోన్‌ను మే 16న లాంచ్ చేస్తున్నట్లు ప్రకటన చేసింది. మరియు అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ చైనాలో విడుదల అయింది.
ఐకూ Z9X 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు :
ఈ ఐకూ Z9X 5G స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్ మరియు 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ మెరుగైన విజువల్ అనుభూతిని అందిస్తుందని సంస్థ చెబుతోంది.

ఆండ్రాయిడ్ 14 ఆధారిత FunTouchOS ! :
ఐకూ కొత్త స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 8GB LPDDR4x ర్యామ్ మరియు 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేయబడుతుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత FunTouchOS పైన పనిచేస్తుంది.
50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం విషయానికి వస్తే ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరాల ద్వారా మెరుగైన ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేయవచ్చు.

6000mAh బ్యాటరీ సామర్థ్యం :
ఐకూ Z9X 5G స్మా్ర్ట్‌ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యా్మ్ +128GB అంతర్గత స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అయితే ధర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
ఈ ఐకూ హ్యాండ్‌సెట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సహా IP64 రేటింగ్‌తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్‌గా వస్తుంది. స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా వైఫై 5, బ్లూటూత్ 5.1 వంటి ఫీచర్లతో లాంచ్ కానుంది. అయితే ధర ఇతర కొన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
ఈ ఐకూ Z9X 5G హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.15000 కంటే తక్కువగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. మరియు ప్రముఖ ఈ- కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. భారత్ వేరియంట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








