Home
Mobile

ధర రూ.11999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా 5G స్మార్ట్‌ఫోన్‌.. అమెజాన్‌లో సేల్‌ ప్రారంభం..!

ఐకూ నుంచి ఇటీవల ఐకూ Z9X 5G స్మార్ట్‌ఫోన్‌ (iQOO Z9X 5G Smartphone Sale) ఇటీవల భారత్‌లో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. మరియు 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌ సేల్ ప్రారంభం అయింది. అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ సేల్‌ ఆఫర్ల పూర్తి వివరాలు.

ఐకూ Z9X 5G స్పెసిఫికేషన్లు : ఐకూ Z9X 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో కూడిన 6.72 అంగుళాల అల్ట్రా బ్రైట్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 44W ఫ్లాష్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

iQOO Z9X 5G Smartphone sale is live

ఈ హ్యాండ్‌సెట్‌ 4nm స్నాప్‌ డ్రాగన్‌ 6 జెన్‌ 1 మొబైల్ ప్లాట్‌ఫాం పైన పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ రెండు సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్, 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుందని సంస్థ తెలిపింది.

కెమెరా విభాగం పరంగా ఐకూ Z9X 5G స్మార్ట్‌ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరా, మరియు 2MP బోకేష్‌ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియోల కోసం 8MP కెమెరాతో లాంచ్ అయింది. ఈ ఐకూ Z9X 5G స్మార్ట్‌ఫోన్‌ మెరుగైన ఆడియో కోసం డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. మరియు IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రిసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

iQOO Z9X 5G Smartphone sale is live

మూడు వేరియంట్లలో లభిస్తుంది :
ఈ ఐకూ Z9x 5G స్మార్ట్‌ఫోన్‌ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 6GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

ఐకూ Z9X 5G స్మార్ట్‌ఫోన్‌ ధర : ఐకూ Z9X 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.12999 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ రూ.14,499 గా ఉంది. అదే 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.15999 గా ఉంది.

iQOO Z9X 5G Smartphone sale is live

ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఐకూ ఈ-స్టోర్‌ మరియు అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ICICI మరియు SBI బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. మరియు 6GB, 8GB ర్యామ్‌ వేరియంట్‌లపై కూపన్‌ ద్వారా అదనంగా రూ.500 తగ్గింపును పొందవచ్చు.

రూ.11999 కొనుగోలు చేయవచ్చు : ఫలితంగా 4GB ర్యామ్ వేరియంట్‌ ను రూ.11999, 6GB ర్యా్మ్‌ వేరియంట్ ధర రూ.12999, 8GB ర్యామ్‌ వేరియంట్ ధర రూ.14999 గా ఉంటుంది. ఈ ఐకూ Z9x 5G స్మార్ట్‌ఫోన్‌ టోర్నడో గ్రీన్‌, స్ట్రోమ్‌ గ్రే రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO Z9X 5G Smartphone sale is live on amazon here is the best deal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X