Home
Mobile

50MP కెమెరా, 6000mAh బ్యాటరీతో iQOO 5G స్మార్ట్‌ఫోన్‌.. స్పెసిఫికేషన్లు, లాంచ్‌ వివరాలు..!

ఐకూ నుంచి మే 16 వ తేదీన భారత్‌ మార్కెట్‌ లోకి ఐకూ Z9X 5G ( iQOO Z9X 5G Smartphone) విడుదల కానుంది. అయితే ఈ హ్యాండ్‌ సెట్‌కు సంబంధించిన అనేక స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ ల వివరాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే సంస్థ కూడా కొన్ని వివరాలను వెల్లడించింది.

అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు :
ఐకూ Z9X 5G స్మార్ట్‌ ఫోన్‌ చైనాలో గత నెలలో విడుదల అయింది. అయితే ఈ ఐకూ హ్యాండ్‌ సెట్‌ ధర రూ.20,000 కంటే తక్కువ ధరకే భారత్‌ మార్కెట్‌ లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. విడుదల అనంతరం (iQOO Z9X 5G Sale) అమెజాన్‌ ద్వారా ఈ స్మార్ట్‌ ఫోన్‌ ను కొనుగోలు చేయవచ్చు.

iQOO Z9X 5G specifications confirmed

ఐకూ Z9X 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు :
ఈ ఐకూ Z9X 5G స్మార్ట్‌ ఫోన్ డిజైన్ పరంగా సన్నగా ఉంటుంది. మరియు 6.72 అంగుళాల 120Hz పుల్‌ HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ తో లాంచ్‌ కానుంది. కేవలం 7.99mm అల్ట్రా డిజైన్‌ తో లాంచ్ కానుంది.

ఈ హ్యాండ్‌ సెట్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తుంది. రెండు ఆండ్రాయిడ్‌ OS అప్‌ డేట్‌ లతోపాటు మూడు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చని సంస్థ వెల్లడించింది. మరియు స్నాప్‌ డ్రాగన్‌ 6 జెన్‌ 1 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. గరిష్ఠంగా 8GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఐకూ Z9X 5G స్మార్ట్‌ ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెల్ఫీ కెమెరాతో లాంచ్‌ కానుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు. స్టీరియో స్పీకర్లతోపాటు IP54 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్‌ రిసిస్టెంట్‌ గా రానుంది.

6000mAh బ్యాటరీ సామర్థ్యం :
ఐకూ Z9X 5G స్మార్ట్‌ ఫోన్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని ఐకూ వెల్లడించింది. ఒక రోజంతా పూర్తిగా వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ హ్యాండ్‌ సెట్ టోర్నడో గ్రీన్ మరియు స్ట్రోమ్‌ గ్రే రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO Z9X 5G Smartphone specifications confirmed ahead of launch on may 16 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X