6000mAh బ్యాటరీ, 50MP AI కెమెరాలతో iQOO 5G స్మార్ట్‌ఫోన్.. రేపే విడుదల..!!
ఐకూ సంస్థ నుంచి భారత్ మార్కెట్‌లోకి రేపు (మే 16వ తేదీ) ఐకూ Z9x 5G స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. ఈ హ్యాండ్ సెట్ అనేక కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కలిగి ఉంది. క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 SoC చిప్ సెట్ సహా 6.72 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 50MP కెమెరాను కలిగి ఉంటుంది.
ఐకూ Z9X 5G స్మార్ట్ ఫోన్ ఉహించిన స్పెసిఫికేషన్లు :
ఐకూ Z9X 5G స్మార్ట్ ఫోన్ (iQOO Z9X 5G Smartphone) 6.72 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్ మరియు 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్ నెస్‌ను కూడా కలిగి ఉంటుంది.

ఈ హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది. దీంతోపాటు క్లాల్‌కాం స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్ సెట్‌ను కలిగి ఉంటుంది. 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.
కెమెరా విభాగం పరంగా ఈ ఐకూ Z9X 5G స్మార్ట్ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP AI ప్రైమరీ కెమెరా సహా 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరా ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఐకూ Z9X 5G స్మార్ట్‌ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సంస్థ వెల్లడించింది. సింగిల్ ఛార్జింగ్ ద్వారా ఒక్కరోజు పాటు పూర్తిగా వినియోగించుకొనేందుకు అవకాశం ఉంటుందని ఐకూ సంస్థ తెలిపింది. 30 నిమిషాల ఛార్జింగ్‌తో సుమారు 10 గంటల వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
కనెక్టివిటీ పరంగా వై ఫై - 5 మరియు బ్లూటూత్ 5.1 ఫీచర్లను కలిగి ఉంది. దీంతోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుందని మెరుగైన ఆడియో అనుభూతిని పొందుతారని సంస్థ పేర్కొంది. IP64 రేటింగ్‌తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ గా వస్తుంది.
ఐకూ Z9X 5G స్మార్ట్ ఫోన్ బ్రష్డ్ గ్రీన్ మరియు గ్రాఫేన్ బ్లూ కలర్ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 199 గ్రాములుగా ఉంది. చైనాలో ఈ స్మార్ట్ ఫోన్ ధర Yuan 1,499 గా ఉంది. భారత కరెన్సీ ప్రకారం రూ.10,999 గా ఉంటుందని తెలుస్తోంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








