6000mAh బ్యాటరీ, 50MP AI కెమెరా, 3 సంవత్సరాల అప్‌డేట్స్ అందించే 5G ఫోన్‌పై రూ.1500 డిస్కౌంట్..!
iQOO Z9x 5G Smartphone : ఐకూ నుంచి భారత్ మార్కెట్‌లోకి జులై 24 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఐకూ Z10R 5G స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. అయితే ప్రస్తుతం ఐకూలో అనేక సెగ్మెంట్స్‌లో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఐకూ Z9x 5G స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీతోపాటు అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది.
విడుదల సమయంలో ధరలు :
ఐకూ Z9x 5G స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12999 గా ఉండేది. అదే 6GB/128GB ధర రూ.14499, 8GB/128GB ధర రూ.15999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

రూ.1500 గరిష్ట కూపన్ డిస్కౌంట్ :
ప్రస్తుతం ఈ ఫోన్ 4GB ర్యామ్ వేరియంట్ ధర రూ.11999 గా ఉంది. దీంతోపాటు కూపన్ కోడ్ ద్వారా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అంటే రూ.10999 కే సొంతం చేసుకోవచ్చు. అదే 6GB ర్యామ్ వేరియంట్ ధర రూ.13499 గా ఉంది. అయితే కూపన్ కోడ్ ద్వారా రూ.1500 డిస్కౌంట్‌ను పొందవచ్చు.
రెండు కలర్ వేరియంట్స్ :
అయితే 8GB ర్యామ్ వేరియంట్ ప్రస్తుతం అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్ టోర్నడో గ్రీన్, స్ట్ర్రోమ్ గ్రీన్ కలర్ వేరియంట్స్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

డిస్‌ప్లే, చిప్‌సెట్ వివరాలు :
ఐకూ Z9X 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.72 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 4nm స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 మొబైల్ ప్లాట్‌ఫాం పైన పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. మైక్రో SD కార్డుతో 1TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంటుంది.
6000mAh భారీ బ్యాటరీ :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 ను కలిగి ఉంది. ఈ ఫోన్ రెండు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్ 44W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి రెండు రోజులపాటు ఉపయోగించుకోవచ్చని ఐకూ చెబుతోంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 50MP AI ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. ప్రైమరీ కెమెరా AI నైట్ మోడ్‌ను సపోర్టు చేస్తుంది. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications







