మొబైల్‌ బ్యాంకింగ్ వినియోగం సులభం

By Super
|
Mobile Banking
ఏ సమయంలో అయినా సురక్షితంగా బ్యాంక్‌ ఖాతాను నిర్వహించుకునే వీలున్న మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలు రెండేళ్ల క్రితమే అందుబాటులోకి వచ్చినా, ఈ సదుపాయం వినియోగిస్తున్న వారు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. 81 కోట్ల మొబైల్‌ కనెక్షన్లు ఉన్న దేశంలో, భవిష్యత్తులో మొబైల్‌ బ్యాంకింగ్‌ వినియోగదార్ల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందని బ్యాంకర్లు భావిస్తున్నారు. మొబైల్‌ బ్యాంకింగ్‌ వినియోగానికి ఏ విధమైన రుసుమును బ్యాంకులు వసూలు చేయడం లేదు. దేశీయ దిగ్గజ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ సర్కిల్‌ పరిధిలో లక్షన్నర మంది మొబైల్‌ బ్యాంకింగ్‌ సదుపాయాన్ని వినియోగిస్తున్నారని సమాచారం. సెల్‌ఫోన్‌ ద్వారా బ్యాంక్‌ లావాదేవీలు సురక్షితమే అని, కేవలం మొబైల్‌ నెట్‌ (జీపీఆర్‌ఎస్‌), లేదా సాధారణ ఎస్‌ఎంఎస్‌ ఛార్జీలు నెట్‌వర్క్‌ ఆపరేటర్‌కు చెల్లించాలి మినహా, ఇతర ఖర్చులేవీ ఉండవని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చెబుతోంది. ఎస్‌బీఐ ఖాతాదారులు 'ఫ్రీడమ్‌'గా వ్యవహరించే మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలు పొందాలంటే..

ఏ ఫోన్‌, నెట్‌వర్క్‌ అయినా సరే..: నోకియా, శాంసంగ్‌, ఎల్‌జీ, సోనీ ఎరిక్సన్‌, మోటరోలా వంటి బ్రాండెడ్‌ మొబైల్స్‌తో పాటు మైక్రోమ్యాక్స్‌, కార్బన్‌, సెల్‌కాన్‌ వంటి దేశీయ బ్రాండెడ్‌ మొబైల్‌ ఫోన్‌ అయినా ఎస్‌బీఐ మొబైల్‌ బ్యాంకింగ్‌కు ఉపయోగపడుతుంది. ఏ నెట్‌వర్క్‌ కనెక్షన్‌ అయినా సపోర్ట్‌ చేస్తుంది. జీపీఆర్‌ఎస్‌ (నెట్‌), ఎస్‌ఎంఎస్‌ పద్ధతిలో ఈ సేవలు పొందవచ్చు. జీపీఆర్‌ఎస్‌ ద్వారా ఖాతాలో నిల్వ, మినీ స్టేట్‌మెంట్‌ వంటి విచారణ సేవలు; రోజుకు రూ.50 వేలు- నెలకు రూ.2.50 లక్షల వరకు ఎస్‌బీఐ లేదా ఇతర బ్యాంక్‌ ఖాతాలకు బదిలీ చేసుకోవచ్చు. చెక్‌బుక్‌కు అభ్యర్థన, విద్యుత్తు - టెలిఫోన్‌ వంటి వినియోగ బిల్లులు, క్రెడిట్‌కార్డ్‌ బిల్లులు, బీమా ప్రీమియం చెల్లింపులు, దుకాణాల్లో కొనుగోళ్లు జరపవచ్చు. మొబైల్‌ టాప్‌ అప్‌, డిష్‌టీవీ రీఛార్జి చేసుకోవచ్చు. డీమ్యాట్‌ అకౌంట్‌ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎస్‌ఎంఎస్‌ పద్ధతిలో ఖాతాలో నిల్వ, మినీ స్టేట్‌మెంట్‌, డిష్‌ టీవీ రీఛార్జి, మొబైల్‌ టాప్‌అప్‌, రోజుకు రూ.1,000 నెలకు రూ.5 వేల వరకు నగదు బదిలీ చేసుకోవచ్చు.

ఎస్‌బీఐ ఫ్రీడమ్‌ అప్లికేషన్‌ను జీపీఆర్‌ఎస్‌ ద్వారా సెల్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందుకు http://mobile.prepaidsbi.com/ sbidownloader/ ను బ్రౌజ్‌ చేసి app.jsp ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆప్పుడు డ్రాప్‌బాక్స్‌లో కనిపించే నోకియా, శాంసంగ్‌ వంటి మొబైల్‌ కంపెనీల పేర్లు చూసి, మనం వాడే కంపెనీ పేరు ఎంచుకోవాలి. అనంతరం మొబైల్‌ ఏ మోడల్‌ అని అడుగుతుంది. ఆ లిస్టులో మన మొబైల్‌ మోడల్‌ లేకపోతే టైప్‌ చేయాలి. అప్పుడు స్క్రీన్‌పై jar file ను ఎంపిక చేసుకుంటే, ఫైల్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. అనంతరం 9223440000 నెంబరుకు MBSREG అని ఎస్‌ఎంఎస్‌ చేస్తే, యూజర్‌ ఐడీ, ఎంపిన్‌ వస్తాయి.

స్క్రీన్‌పై కనిపించే SBI Freedom లోగోపై క్లిక్‌ చేసి, యూజర్‌ ఐడీతో లాగిన్‌ అవ్వాలి. మెసేజ్‌ ద్వారా వచ్చిన ఎంపిన్‌ నెంబరు మార్చుకోమని సూచన వస్తుంది. కొత్తగా 6 అంకెల సంఖ్యను టైప్‌ చేస్తే, ఎంపిన్‌ను మార్చినట్లు మెసేజ్‌ వస్తుంది. దీంతోపాటు హ్యాండ్‌సెట్‌ వాలిడేషన్‌ పూర్తయిందని, సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎం లేదా బ్యాంక్‌ శాఖకు వెళ్లి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేయమని మెసేజ్‌ వస్తుంది.

ఏటీఎం దగ్గరకు వెళ్లి, ఏటీఎం/డెబిట్‌ కార్డును స్వైప్‌ చేసినప్పుడు స్క్రీన్‌పై కనిపించే అంశాల్లో మొబైల్‌ రి

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X