Home
Mobile

OPPO Find X9 Pro స్మార్ట్‌ఫోన్ 2025 లో అత్యుత్తమ ఫ్లాగ్‌షిప్‌ కెమెరా ఫోన్‌గా నిలుస్తుందా?

OPPO Find X9 Pro స్మార్ట్‌ఫోన్ ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌గా లాంచ్‌ అయింది. 50MP ప్రైమరీ, 50MP అల్ట్రావైడ్‌, 200MP టెలిఫోటో కెమెరాలు మెరుగైన అనుభూతిని అందిస్తాయి. ఈ ఫోన్‌ కెమెరా విభాగం Hasselblad, LUMO ఇమేజ్‌ ఇంజిన్‌ సపోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9500 చిప్‌, అమోలెడ్‌ డిస్‌ప్లే, ColorOS 16, 7500mAh బ్యాటరీ తో పనిచేస్తుంది. ఫలితంగా మంచి అనుభూతి కలుగుతుంది.

is the oppo find x9 pro the best flagship camera phone of 2025

ఫ్లాగ్‌షిప్‌ కెమెరా అనుభూతి
ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఆప్టికల్ స్టెబిలైజేషన్‌, f/1,5 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్‌ వ్యూతో 50MP అల్ట్రావైడ్‌ కెమెరా మరియు f/2.1 అపేచర్‌తో 200MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. మెరుగైన కెమెరా స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నా, ఎలాంటి పనితీరును కనబరుస్తుందనేదే ముఖ్యం.

is the oppo find x9 pro the best flagship camera phone of 2025

ఈ ఫోన్‌ ప్రైమరీ కెమెరా కావాల్సినంత వెలుతురు ను ఉపయోగించుకొని మెరుగ్గా క్యాప్చర్‌ చేస్తుంది. ఇంట్లో లేదా రెస్టారెంట్‌ లైటింగ్‌లో వ్యక్తులుు లేదా మీ పెంపుడు జంతువులు లేదా కదులుతున్న వస్తువులను క్యాప్చర్‌ చేసే సమయంలో ఈ పనితీరును మీరు గమనించవచ్చు. అదే విధంగా ప్రైమరీ కెమెరాకు సరిపోయేలా అల్ట్రావైడ్‌ కెమెరా పనితీరు కనబరుస్తుంది. వేర్వేరుగా క్యాప్చర్‌ చేసిన రెండు ఫోటోలు లేదా వీడియోలు ఒకే డివైజ్ తో క్యాప్చర్‌ చేసినట్లు అనిపిస్తాయి. చాలా ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌లలో ఈ తరహా ఫీచర్‌లు ఉండడం లేదు.

ఇందులో మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. 200MP టెలిఫోటో కెమెరా. ఈ సెన్సర్‌ కారణంగా జూమ్‌ షాట్‌లు మరింత స్పష్టంగా, మెరుగ్గా అనిపిస్తాయి. 3x, 6x జూమ్‌ ద్వారా తీసిన ఫోటోలు నేచురల్‌గా అనిపిస్తాయి. ఈ ధరలో అందుబాటులో ఉన్న ఇతర ఫోన్‌లు 10x నుంచి 13x వద్ద తీసిన ఫోటోల కంటే ఆకట్టుకొనేలా అనిపిస్తాయి. టెలిఫోటో లెన్స్‌ పనితీరు మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.

కలర్‌ సైన్స్‌
కెమెరా విభాగంలో పనితీరులో Hasselblad తో భాగస్వామ్యం ప్రధాన పాత్ర పోషిస్తోంది. కలర్‌ ట్యూనింగ్‌ పరిణితి చెందినదిగా అనిపిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే రియలస్టిక్‌గా అనిపిస్తుంది. దీంతోపాటు స్కి్న్‌టోన్‌ ఇన్‌డోర్‌, అవుట్‌డోర్‌లోనూ బ్యాలెన్సింగ్‌గా ఉంది. ఫ్రేమ్‌పై సూర్యకాంతి పడినా ఉష్ణోగ్రతలో ఆకస్మికంగా ఎటువంటి మార్పు ఉండదు.

is the oppo find x9 pro the best flagship camera phone of 2025

వెనుక వైపు ఉన్న మూడు కెమెరాల ద్వారా క్యాప్చర్‌ చేసిన ఫోటోలు, వీడియోలు ఒకేతరహా కాంట్రాస్ట్‌, టోనాలిటీని అందిస్తున్నాయి. ఫుడ్‌ ఫోటోగ్రఫీ, బీచ్‌ సన్‌సెట్‌, పండుగ క్షణాలు అద్భుతంగా అనిపిస్తాయి. ఫోటోగ్రఫీ ఎక్కువగా ఇష్టపడే వారికి గుర్తించదగిన మార్పులు చూపిస్తుంది.

తక్కువ కాంతిలోనూ
తక్కువ వెలుతురులో చాలా ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌ తనదైన పనితీరును కనబరిచి ఆకట్టుకుంటాయి. రాత్రి వేళలో క్యాప్చర్ చేసినా పగటి పూట అనుభూతిని కలిగిస్తాయి. అయితే ఫైండ్‌ X9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ రెండు ప్రత్యేకతలను కలిగి ఉంది.

is the oppo find x9 pro the best flagship camera phone of 2025

ఒప్పో సొంత ఇమేజింగ్‌ సిస్టమ్‌ LUMP ఇమేజ్‌ ఇంజిన్‌.. అల్ట్రా XDR వ్యవస్థకు సమీపంగా పనిచేస్తుంది. ఇది లైటింగ్‌ పరిస్థితులను విశ్లేషణ చేస్తుంది. ఫోటో ఎలా క్యాప్చర్‌ చేయాలి, వాతావారణం స్పష్టంగా కనిపించేలా ఎలా క్యాప్చర్‌ చేయాలి వంటి అంశాలను ప్రాధాన్యతగా చూసుకుంటుంది. నీడ చెడు ప్రభావం చూపకుండా చూస్తుంది. దుస్తులు, చర్మం, ఆహరం ఫోటోలు చెక్కుచెదరకుండా చూపిస్తుంది.

is the oppo find x9 pro the best flagship camera phone of 2025

డిమ్‌ కేఫ్‌ ఇంటీరియర్ అయినా, రాత్రి సమయంలో స్ట్రీట్‌ ఫుడ్‌ స్టాల్‌ అయినా, పండుగల కారణంగా ఏర్పడిన సమూహాలు అయినా.. ఆయా పరిస్థితులలు చెక్కుచెదరకుండా ఈ ఫోన్‌ క్యాప్చర్‌ చేస్తుంది. నైట్‌ మోడ్‌ను ప్రాసెస్‌పై ఎక్కువగా దృష్టిసారించే ఇతర డివైజ్‌ల నుంచి ఈ ఫోన్‌ను వేరుచేస్తుంది.

LUMO ఇమేజ్‌ ఇంజిన్‌
LUMO ఇమేజ్‌ ఇంజిన్‌ ను ఇక్కడ కచ్చితంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. మొత్తం ఇమేజింగ్ అనుభూతిని ఏకం చేస్తుంది. డైనమిక్ రేంజ్‌ను మెరుగుపరచడం, మల్టీ ఫ్రేమ్‌ క్యాప్చర్‌ను వేగవంతం చేయడం, రంగుల కచ్చితత్వాన్ని పెంచుతుంది. దీంతోపాటు మూడు కెమెరాలు ఒకే విధమైన ఫలితాలు ఇచ్చేలా పనిచేస్తుంది.

సింపుల్‌గా చెప్పాలంటే అంచనాలకు అనుగుణంగా కెమెరా పనితీరు ఉంటుంది. ప్రైమరీ కెమెరా నుంచి టెలిఫోటో లెన్స్‌ను మారడం వల్ల ఎక్స్‌పోజర్‌లో పెద్ద మార్పులు ఉండవు. వీటితోపాటు ఫోటోలను క్యాప్చర్‌ చేస్తున్న సమయంలో బాగా వెలుతురు ఉన్న దృశ్యం నుంచి తక్కువ కాంతి లేదా నీడ ఉన్న ప్రాంతానికి వెళ్లడం వల్ల వైట్‌ బ్యాలెన్స్‌ గందరగోళంగా ఉండదు. వీటితోపాటు వరుసగా క్యాప్చర్‌ చేసిన హ్యాండ్‌హెల్డ్‌ షాట్‌లు అదే టోన్‌, క్లారిటీని కలిగి ఉంటాయి. ఇలాంటి పనితీరు చాలా అరుదు అనే చెప్పాలి.

వీడియో రికార్డింగ్‌ సమయంలో ఈ ఫీచర్‌ మెరుగైన పనితీరునే కనబరుస్తుంది. ఎక్స్‌పోజర్‌ ట్రాన్సిషన్‌లు స్మూత్‌గా ఉంటాయి. రాత్రి సమయాల్లో క్యాప్చర్‌ చేసిన విజువల్స్‌ కూడా ఆకట్టుకుంటుంది. దీంతోపాటు ఎక్కువ సమయం 4K రికార్డింగ్‌ చేసినా ఫోన్‌ థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ ఆకట్టుకుంటుంది. కంటెంట్‌ క్రియేటర్లు, వ్లాగ్‌లు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది.

ప్రత్యేకంగా నిలిచే టెలిఫోటో లెన్స్‌
గత కొన్ని సంవత్సరాల నుంచి స్మార్ట్‌ఫోన్‌ జూమ్‌లో అనేక మార్పులు వచ్చాయి. అయితే ఈ జామింగ్‌ సామర్థ్యం వివిధ స్మార్ట్‌ఫోన్‌లో భిన్నంగా ఉంటుంది. అదే సమయంలో OPPO Find X9 Pro స్మార్ట్‌ఫోన్ 200MP టెలిఫోటో లెన్స్‌ మరింత ప్రత్యేకంగా నిలుస్తుంది.

టెలిఫోటో లెన్స్‌లోని f/2.1 అపేచర్‌ లెన్స్‌లోకి ఎక్కువ కాంతి వెళ్లేలా అనుమతిస్తుంది. ఫలితంగా పగటిపూట, తక్కువ కాంతి సందర్బాల్లో క్లారిటిగా ఉండేలా చూస్తుంది. వైల్డ్‌లైఫ్‌ షాట్స్‌, స్టేజ్‌ ఫెర్ఫార్మెన్స్‌ సహా సుదూరంగా ఉన్న వస్తువులు కూడా అత్యంత కచ్చితంగా ఉంటాయి. ఇన్‌డోర్‌లోనూ ప్రైమరీ, అల్ట్రావైడ్ లెన్స్‌తో టెలిఫోటో లెన్స్‌ కూడా కలర్స్‌ పరంగా ఆకట్టుకొనేలా ఉంటుంది. ఈ ఫోన్‌ టెలిఫోటో లెన్స్‌ అందుకే ప్రత్యేకం. ఇతర డివైజ్‌లలో టెలిఫోటో లెన్స్‌ మిక్సిడ్ లైటింగ్‌ సహా ఇతర గుణాలను కోల్పోతాయి.

is the oppo find x9 pro the best flagship camera phone of 2025

పొర్ట్రెయిట్‌ విషయానికి వస్తే.. టెలిఫోటో లెన్స్‌.. రెండో ప్రైమరీ కెమెరాగా పనిచేస్తుంది. స్మూత్‌, సినిమాటిక్‌గా ఉంటుంది. బేస్‌ కటౌట్‌లు లేకుండా బ్యాగ్రౌండ్‌ సహజంగా కనిపిస్తుంది. ఈ లెన్స్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా సిస్టమ్‌ హైలెట్‌గా నిలుస్తుంది.

మరింత మెరుగైన అనుభూతి కావాలనుకొని భావించే యూజర్ల కోసం OPPO Hasselblad టెలికన్వర్టర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఉన్న 200MP టెలిఫోటో లెన్స్‌ సజావుగా పనిచేసేందుకు సాయం చేస్తుంది. మెటల్‌ బిల్ట్‌, క్లాసిక్‌ డిజైన్... నిజంగా ప్రొఫెషనల్‌ అనుభూతిని అంది‌స్తుంది. ఇందులో ఉన్న 3.28x ఆప్టికల్‌ మ్యాగ్నిఫికేషన్ ఫోన్‌ జూమింగ్ సామర్థ్యాన్ని 10x ఆప్టికల్‌ జూమ్‌కు సమానమైనదిగా పనిచేస్తుంది. దీంతోపాటు ఒప్పో కంప్యూటేషన‌ల్ ట్యూనింగ్‌ సిస్టమ్‌.. ఫోటోల కోసం 200x, వీడియో కోసం 50x వరకు పనిచేస్తుంది.

is the oppo find x9 pro the best flagship camera phone of 2025

కంటెంట్‌ క్రియేటర్లకు ఎంతో ఉపయోగం
ఈ స్మార్ట్‌ఫోన్‌ డాల్బీ విజన్‌ మరియు ACES తో కూడిన LOG వీడియో సపోర్టుతో 120fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టుచేస్తుంది. ఎటువంటి అడ్వాన్స్‌డ్‌ మోడ్ అవసరం లేకుండానే, వీడియో అవుట్‌పుట్‌ ఆకట్టుకుంటుంది. నడుస్తున్నప్పుడు క్యాప్చర్‌ చేస్తున్న విజువల్స్ కూడా మెరుగ్గానే ఉంటాయి. బాహ్య వాతావరణంలోనూ ఈ ఫోన్‌లో ఉన్న 4-మైక్రోఫోన్‌ ఆడియో సిస్టమ్‌ క్లారిటీగా ఆడియోను క్యాప్చర్‌ చేస్తుంది.

ఎక్కువ సమయం వీడియో షూటింగ్‌ను కూడా ఈ ఫోన్‌ సపోర్టు చేస్తుంది. మరియు ఎక్కువ వేడెక్కడం సహా పనితీరులో ప్రభావం చూపడం వంటివి కూడా ఉండవు. ఫలితంగా కంటెంట్‌ క్రియేటర్లకు అనుకూలమైనదిగా ఈ ఫోన్‌ ఉంటుంది.

కెమెరానే కాకుండా పనితీరు పరంగానూ ఆకట్టుకుంటుంది
ఈ ఫోన్‌ కెమెరాలతోపాటు పనితీరు కూడా ఆకట్టుకుంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ కేవలం గేమింగ్‌నే కాకుండా ఇమేజ్‌ ప్రాసెసింగ్‌, HDR క్యాప్చర్‌, ఆటోఫోకస్‌ క్యాలుక్యులేషన్‌లను కూడా మెరుగుపరిచింది. ప్రతికూల లైటింగ్ పరిస్థితుల్లోనూ కెమెరా పనితీరు ఆకట్టుకొనే విధంగా ఉంటుంది.

ప్రతిరోజు ఉపయోగించుకొనే సమయంలో అనుకూల పనితీరును కనబరుస్తుంది. యాప్‌లు త్వరగా లోడ్‌ అవుతాయి. మల్టీటాస్కింగ్‌తోపాటు సోషల్‌ మీడియా వినియోగిస్తున్న సందర్బాల్లోనూ వేడెక్కకుండా ఉంటుంది. కెమెరాను ఎక్కువ సమయం ఉపయోగించినా, 4K వీడియోలను క్యాప్చర్‌ చేసినా, ఫోన్ వేడెక్కకుండా ఉంటుంది.

ఈ ఫోన్‌లోని అమోలెడ్‌ డిస్‌ప్లే బ్రైట్‌, షార్ప్‌, కల‌ర్ ఆక్యురేట్‌గా ఉంటుంది. బయట ప్రాంతాల్లో షూట్ చేస్తున్నా ఆకట్టుకొనే విధంగానే ఉంటుంది. ఫోటోలు, వీడియోలు క్యాప్చర్‌ చేస్తున్న సమయంలో నేచురల్‌ లుక్‌ డ్యామేజీ కాకుండా ఉండాలని భావిస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది.

is the oppo find x9 pro the best flagship camera phone of 2025

దీంతోపాటు ఈ ఫోన్ కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే అంచుల వద్ద కూడా టచ్‌ రెస్పాన్స్ అత్యంత కచ్చితత్వంతో ఉంటుంది. ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌గా ఈ డిస్‌ప్లే మెరుగ్గా అనిపిస్తుంది. మీడియా, బ్రౌజంగ్‌, ఎడిటింగ్‌ సహా కంటెంట్‌ క్రియేషన్‌ సమయాల్లో అనుకూలంగా ఉంటుంది.

is the oppo find x9 pro the best flagship camera phone of 2025

వీటితోపాటు కొత్తగా లాంచ్ అయిన ColorOs 16 ఆకట్టుకుంటుంది. గత OS వెర్షన్‌తో పోలిస్తే.. ఫ్యూయిడ్‌ యానిమేషన్‌, సున్నితమైన పరివర్తన, ఫోటోలను ఎడిట్‌ సహా ఇతర సందర్భాలు, లెన్స్‌ల మధ్య తరచు మారడం సహా 4K ఫుటేజ్‌ స్క్రబ్బింగ్ సమయాల్లో UI ప్రతిస్పందన ఆకట్టుకుంటుంది. హాప్టిక్‌ ఫీడ్‌బ్యాక్‌, స్మూత్‌ స్క్రోలింగ్‌ ఈ ఫోన్‌ను ప్రీమియం మరియు నమ్మదగిన డివైజ్‌గా నిలుపుతాయి.

ఈ OPPO స్మా్ర్ట్‌ఫోన్ ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్‌లో భారీ బ్యాటరీ కలిగిన డివైజ్‌గా నిలిచింది. 7500mAh బ్యాటరీ సామర్థ్యం, మెరుగైన ఫోటోగ్రఫీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్‌ 80W SUPERVOOC ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7500mAh బ్యాటరీని కలిగి ఉంది. వీడియో రికార్డింగ్, ఎక్కువ సమయంపాటు టెలిఫోటో లెన్స్‌ను వినియోగించినా థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ పరంగా మెరుగైన పనితీరు కనబరుస్తుంది.

మంచి ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌
OPPO Find X9 Pro స్మార్ట్‌ఫోన్‌ మెరుగైన కెమెరా విభాగం, ఫ్లాగ్‌షిప్‌ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటుంది. LUMO ఇమేజ్‌ ఇంజిన్‌ కెమెరా విభాగం స్థిరంగా, నేచురల్‌గా అనిపిస్తుంది. ఈ సిస్టమ్‌ పవర్‌ఫుల్ సపోర్టును అందిస్తుంది. అదే సమయంలో ఫోన్ పనితీరు, బ్యాటరీ లైఫ్‌, ఫాస్ట్ ఛార్జింగ్‌, ColorOS 16 వంటి ఫీచర్లు.. ఓ మంచి ఫ్లాగ్‌షిప్‌ డివైజ్‌గా నిలుపుతాయి.

is the oppo find x9 pro the best flagship camera phone of 2025

అనేక సంవత్సరాలుగా విడుదల అవుతున్న ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్‌ ఒకే ఫీచర్‌ పై ఎక్కువగా దృష్టిసారించేవి. ఈ OPPO స్మార్ట్‌ఫోన్‌ మాత్రం కెమెరా, పనితీరును బ్యాలెన్స్‌గా ఉండేలా చూసింది. డిస్‌ప్లే క్వాలిటీ సహా ఇతర విభాగాల్లోనూ టాప్‌గా నిలుస్తుంది. రోజువారీ మెరుగైన అనుభూతితోపాటు ఫోటోగ్రఫీ కోసం చూస్తున్న యూజర్లకు ఒప్పో ఫైండ్ X9 ప్రో మోడల్ మంచి ఆప్షన్‌గా ఉండే అవకాశం ఉంది.

ధర, సేల్‌ వివరాలు
OPPO Find X9 Pro ప్రస్తుతం OPPO e-Store తోపాటు Amazon మరియు Flipkart లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. మరియు ఇతర ప్రముఖ రిటైల్ స్టోర్‌లలోనూ అందుబాటులో ఉంది. అదే OPPO Find X9 మోడల్‌ ను OPPO e-store తోపాటు Flipkart సహా ప్రధాన ఆఫ్‌లైన్ స్టోర్‌లలోనూ కొనుగోలు చేయవచ్చు.

OPPO Find X9 Pro స్మార్ట్‌ఫోన్‌ కేవలం 16GB ర్యామ్, 512GB స్టోరేజీ వేరియంట్‌లోనే అందుబాటులో ఉంది. సిల్క్‌ వైట్‌, టైటానియం ఛార్‌కోల్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.
అదే OPPO Find X9 స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్, 256GB స్టోరేజీ మరియు 16GB ర్యామ్, 512GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. స్పేస్‌ బ్లాక్‌, టైటానియం గ్రే కలర్‌ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది.

is the oppo find x9 pro the best flagship camera phone of 2025

లాంచ్ ఆఫర్లు
* SBI, HDFC, కోటక్‌ బ్యాంకు, IDFC ఫస్ట్‌ బ్యాంకు కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.
* గరిష్ఠంగా 24 నెలల వరకు నో కాస్ట్‌ EMI ఆప్షన్‌
* Cashify మరియు Servify లో 10 శాతం ఎక్స్చేంజీ బోనస్‌
* Bajaj Finserv, TVS క్రెడిట్‌, HDB ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, IDFC ఫస్ట్‌ బ్యాంకు, పూనావాలా ఫైనాన్సియల్‌ కార్పొరేషన్‌లో జీరో డౌన్‌ పేమెంట్‌ స్కీమ్‌ ఉంది.
* తయారీలో లోపాలు ఉంటే 180 రోజుల హార్డ్‌వేర్‌ రీప్లేస్‌మెంట్
* మూడు నెలలపాటు గూగుల్‌ జెమిని ప్రో
* నవంబర్ 18 నుంచి 30 మధ్య తేదీల్లో కొనుగోలు చేసిన యూజర్లకు రూ.2000 పేటిఎం ఫ్లైట్‌ వోచర్‌
* జియో రూ.649 అంతకంటే ఎక్కువ పోస్ట్‌పెయిడ్‌ ప్లా్‌న్‌లపై రూ.2250 విలువైన ప్రయోజనాలు
* 18 - 25 మధ్య వయస్కుల వారికి 18 నెలలపాటు జెమిని ‌ప్రో ఉచితం

More from GizBot

Best Mobiles in India

English summary
is the oppo find x9 pro the best flagship camera phone of 2025?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X