Home
Mobile

ఆండ్రాయిడ్ కింగ్‌గా నిలుస్తోన్న శామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా.. ఇందులో అంత గొప్పతనం ఏంటబ్బా..?

Samsung Galaxy S25 Ultra: స్మార్ట్‌ఫోన్ ప్రపంచం ఇప్పుడు సాఫ్ట్‌వేర్ మాయలో పడిపోయింది. అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ అంటూ కొత్త ఫీచర్ల వెంట పరుగెడుతున్నారు. కానీ శామ్‌సంగ్ మాత్రం కాస్త డిఫరెంట్ రూట్లో వెళ్తోంది. ఈ కంపెనీ కొత్త గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్‌లో AI టెక్నాలజీతో పాటు, అదిరిపోయే హార్డ్‌వేర్ కూడా కలిపి ఇచ్చింది. అందుకే ఇది ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్లలో కింగ్‌గా నిలిచింది.

* సూపర్ డిస్‌ప్లే, స్ట్రాంగ్ బాడీ..

గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్‌లో 6.9-అంగుళాల భారీ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అంటే స్క్రీన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. స్క్రీన్‌కి కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 ప్రొటెక్షన్ ఉంది. గీతలు పడటం, కింద పడినా పెద్దగా డ్యామేజ్ అవ్వకుండా చూస్తుంది.

Is This the Android King Early Buzz Around Samsung Galaxy S25 Ultra is Exploding

ఫోన్ చుట్టూ టైటానియం ఫ్రేమ్ వాడారు. చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాదు, చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంటుంది. ఫోన్ పెద్దగా ఉన్నా పట్టుకోవడానికి ఈజీగా ఉండేలా డిజైన్ చేశారు. కాబట్టి సింగిల్ హ్యాండ్‌తో మాత్రమే ఫోన్ పట్టుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

* దుమ్మురేపే పర్ఫార్మెన్స్, AI టచ్..

S25 అల్ట్రా లోపల క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంది. శామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్లలో ఇదే టాప్ చిప్. ఈ చిప్ వల్ల AI ఫీచర్లు సూపర్ ఫాస్ట్‌గా పనిచేస్తాయి. గేమ్స్ ఆడుతుంటే అసలు ల్యాగ్ ఉండదు, హెవీ గేమ్స్, యాప్స్ అన్నీ చాలా స్మూత్‌గా రన్ అవుతాయి.

ఇది చాలా వేగంగా పనిచేస్తుంది కాబట్టి, మొబైల్‌తోనే పనులు చేసుకునేవాళ్లు తమ పనుల్ని చకచకా పూర్తి చేసుకోవచ్చు. టైమ్‌ బాగా సేవ్ అవుతుంది. స్టోరేజ్ విషయానికొస్తే 256GB, 512GB, 1TB ఆప్షన్స్ ఉన్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఆండ్రాయిడ్ 15 బేస్డ్‌ వన్ UI 7. ఇది శామ్‌సంగ్ AI టెక్నాలజీతో నడిచే ఇంటర్‌ఫేస్.

* కెమెరా అంటే ఇదే..

శామ్‌సంగ్ కెమెరా విషయంలో ఈసారి బిగ్ అప్‌గ్రేడ్ ఇచ్చింది. ముఖ్యంగా అల్ట్రా-వైడ్ కెమెరా సెన్సార్‌ని 12MP నుంచి ఏకంగా 50MPకి పెంచింది. దీంతో 120-degree వైడ్ యాంగిల్ లో ఫొటోలు తీసుకోవచ్చు. మెయిన్ కెమెరా మాత్రం 200MPతోనే వస్తుంది. ఇంకా 50MP 5X టెలిఫోటో లెన్స్, 10MP 3X జూమ్ కెమెరా కూడా ఉన్నాయి.

సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. దీని అపెర్చర్ f/2.2. ఈ కెమెరాతో షార్ప్, డీటైల్డ్ సెల్ఫీలు తీసుకోవచ్చు. 4K UHD వీడియోలు 30/60fpsలో రికార్డ్ చేయొచ్చు. సెల్ఫీ లవర్స్‌తో పాటు ఎక్కువగా ఫొటోలు తీసే యూజర్లను ఇది అస్సలు నిరాశపరచదు.

* AI ఫీచర్లతో స్మార్ట్ లైఫ్..

S25 అల్ట్రాలో AI ఫీచర్లు చాలా ఉన్నాయి. "AI సెలెక్ట్" అనే ఫీచర్ మీరు చేసే పనులను బట్టి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌లు, GIFలు సజెస్ట్ చేస్తుంది. ఫోన్ స్టైల్‌కి తగ్గట్టు రెడీ అవుతుంది. "సర్కిల్ టు సెర్చ్ విత్ సౌండ్ రికగ్నిషన్" ఫీచర్ ద్వారా వీడియోలు, సోషల్ మీడియా పోస్టులలో వచ్చే పాటల్ని ఈజీగా గుర్తించవచ్చు.

"రైటింగ్ అసిస్టెంట్" ఫీచర్ పెద్ద టెక్స్ట్ లను సమ్మరైజ్ చేస్తుంది, నోట్స్ నీట్‌గా ఫార్మాట్ చేస్తుంది. "డ్రాయింగ్ అసిస్టెంట్" ఫీచర్ టెక్స్ట్, ఇమేజ్ ప్రాంప్ట్‌లను యూజ్ చేసి స్కెచ్‌లు, డిజైన్‌లు చేయడానికి హెల్ప్ చేస్తుంది. క్రియేటివ్ పనులు చేయడానికి ఇది చాలా ఈజీగా ఉంటుంది.

* బ్యాటరీ, ఛార్జింగ్ టెన్షన్ లేదు..

ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఇచ్చారు. 45W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ డౌన్ అయినా ఫాస్ట్‌గా ఛార్జ్ చేసుకోవచ్చు. S25 అల్ట్రా నిజంగా ఒక అద్భుతమైన స్మార్ట్‌ఫోన్. ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్. S25 అల్ట్రా 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.1,29,999.

Best Mobiles in India

English summary
Samsung Galaxy S25 Ultra boasts a 6.9" AMOLED 120Hz display, Snapdragon 8 Elite, advanced cameras (200MP main, 50MP ultrawide), AI features, and a 5000mAh battery, making it a top-tier Android.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X