Home
Mobile

ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ ఫోన్లను కొంటున్నారా? అయితే జాగ్రత్త

ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ ఫోన్లను కొంటున్నారా? అయితే జాగ్రత్త ఎ౦దుక౦టే తాజాగా వడోదరలో భారీ ఫేక్‌ మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ రాకెట్‌ వెలుగులోనికి వచ్చి౦ది.

By Anil

ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ ఫోన్లను కొంటున్నారా? అయితే జాగ్రత్త ఎ౦దుక౦టే తాజాగా వడోదరలో భారీ ఫేక్‌ మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ రాకెట్‌ వెలుగులోనికి వచ్చి౦ది. ఈ రాకెట్‌లో కీలక సూత్రధారి అయిన ఓ వ్యక్తిని వడోదర పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ వ్యక్తి నకిలీ హ్యాండ్‌ సెట్‌లను తయారుచేసి, వాటిని ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయిస్తున్నట్టు పోలీసులు కనుగొన్నారు. అంతేకాక ఈ వ్యక్తి నుంచి రూ.24 లక్షల విలువైన నకిలీ మొబైల్‌ హ్యాండ్‌సెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ నకిలీ మొబైల్స్ లో ముఖ్యంగా ఐఫోన్‌ ఎక్స్‌, శాంసంగ్‌ గెలాక్సీ సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి.నకిలీ హ్యాండ్‌సెట్లపై తాము ఇప్పటికే పలు ఫిర్యాదులను అందుకున్నామని, కాపీరైట్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.ఈ క్రమంలో మీరు ఆన్‌లైన్‌ లో కొనుగోలు చేసే ఫోన్ ఒరిజినల్ లేదా ఫేక్ ఎలా కనిపెట్టాలో ఈ శీర్షిక ద్వారా తెలుపుతున్నాము .

ఒరిజినల్ లేదా  ఫేక్ చాలా సులువుగా తెలుసుకోవచ్చు....

ఒరిజినల్ లేదా ఫేక్ చాలా సులువుగా తెలుసుకోవచ్చు....

ఈ రోజుల్లో ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువ అవడంతో ఏది ఒరిజినల్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ ఏది ఫేక్ ఫోన్ అని తెలుసుకోలేకపోతున్నారు.ఈ క్రమంలో కొన్ని టిప్స్ పాటిస్తే మీరు కొన్న స్మార్ట్ ఫోన్ ఒరిజినల్ లేదా ఫేక్ అని సులువుగా తెలుసుకోవచ్చు.

 మొదటగా IMEI  నెంబర్ ను తెలుసుకోండి...

మొదటగా IMEI నెంబర్ ను తెలుసుకోండి...

మీ ఫోన్లోని IMEI నెంబర్ ను తెలుసుకోవడానికి *#06# అని ప్రెస్ చేయగానే మీకు రెండు IMEI నెంబర్లు కనిపిస్తాయి ఆ నంబర్లను నోట్ చేసుకోండి.

ఫోన్ లో కానీ కంప్యూటర్ లో కానీ బ్రౌజర్ ను ఓపెన్ చేసి....

ఫోన్ లో కానీ కంప్యూటర్ లో కానీ బ్రౌజర్ ను ఓపెన్ చేసి....

తరువాత మీ ఫోన్ లో కానీ కంప్యూటర్ లో కానీ బ్రౌజర్ ను ఓపెన్ చేసి imeiinfo అని సెర్చ్ చేయండి.సెర్చ్ చేసిన వెంటనే మీకు వెబ్ సైట్ కనిపిస్తుంది . ఆ వెబ్ సైట్ ను క్లిక్ చేసి IMEI నెంబర్ ను టైప్ చేసి కింద ఉన్న I'm not a robot అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు కొన్ని క్యాచీ కనిపిస్తుంది అందులో ఇమేజెస్ ను సెలెక్ట్ చేయాలి మీకు ఏ ఇమేజ్ టైప్ వచ్చిందో ఆ ఇమేజ్ ని బట్టి సెలక్ట్ చేసి verify ను క్లిక్ చేయండి .verify అయినా వెంటనే CHECK అనే ఆప్షన్ బటన్ ను క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఫోన్ డీటెయిల్స్ అన్ని అందులో కనిపిస్తాయి .

ఫేక్ ఫోన్ కనిపెట్టడం ఎలా ?

ఫేక్ ఫోన్ కనిపెట్టడం ఎలా ?

ఒకవేళ మీ ఫోన్ కనుక ఫేక్ అయినట్లయితే IMEI నెంబర్ ఎంటర్ చేయంగానే లిస్ట్ లో బ్రాండ్ ఉన్న ప్లేస్ లో వేరే ఇతర ఫోన్ పేరు ఉంటుంది.

logoను గుర్తించండి.....

logoను గుర్తించండి.....

బ్రాండెడ్ ఫోన్స్ కి ఫేక్ ఫోన్స్ లోగో లో చిన్న చిన్న మార్పులు ఉంటాయి ముందు అది ఒకసారి చెక్ చేసుకోండి

Best Mobiles in India

English summary
Is your phone a fake? Cops in Gujarat seize counterfeit mobiles worth Rs 24 lakh.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X