Home
Mobile

రూ.6799 ధరకే 5000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌, అల్ట్రాలింక్‌ ఫీచర్‌తో స్మార్ట్‌ఫోన్‌!

భారత్‌ మార్కెట్‌లో బడ్జెట్, ఎంట్రీ లెవల్‌ ధర సెగ్మెంట్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా ఐటెల్‌ A100 4G స్మార్ట్‌ఫోన్‌ను (itel A100 4G Smartphone) లాంచ్‌ చేసింది. ఈ ఫోన్ ఎంట్రీ లెవల్‌ ధరలో విడుదల అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్‌ 13s హ్యాండ్‌సెట్‌ డిజైన్‌ను పోలి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IR బ్లాస్టర్‌, వర్చువల్‌ ర్యామ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఐటెల్‌ A100 4G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ ఐటెల్‌ స్మార్ట్‌ఫోన్‌ 6.6 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 180Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్, 269 PPI పిక్సల్స్ డెన్సిటీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ డిజైన్ వన్‌ప్లస్‌ 13s తరహా డిజైన్‌ను కలిగి ఉంటుంది.

itel A100 4G smartphone

ప్రాసెసర్‌ వివరాలు :
ఐటెల్‌ A100 4G స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్‌ Unisoc T710 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 4GB ర్యామ్, 64GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ వర్చువల్‌ ర్యామ్‌ ఆప్షన్‌ కూడా ఉంది. గరిష్ఠంగా 8GB వరకు వర్చువల్‌ ర్యామ్‌ను సపోర్టు చేయవచ్చు.

ఆండ్రాయిడ్ 15 OS, 5000mAh బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత itel OS 15 పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ 10W వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

కెమెరాల వివరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు 8MP కెమెరాను కలిగి ఉంది. ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ వెనుక వైపు LED ఫ్లాష్‌ లైట్‌ ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ 4G LTE, వైఫై, బ్లూటూత్‌, IR బ్లాస్టర్‌, GPS, 3.5mm హెడ్‌ఫోన్‌ జాక్‌, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ :
ఈ ఐటెల్ A100 4G స్మార్ట్‌ఫోన్‌ MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు IPX4 రేటింగ్‌తో స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ అల్ట్రా లింక్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుందని ఐటెల్‌ చెబుతోంది. ఈ ఫీచర్‌ ద్వారా రెండు ఐటెల్‌ ఫోన్‌ల మధ్య సరైన నెట్‌వర్క్‌ లేకపోయినా కాల్క్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.

రూ.6799 ధరకే :
ఐటెల్‌ A100 4G స్మార్ట్‌ఫోన్ 3GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.6799 గా ఉంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7499 గా ఉంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ సిల్క్‌ గ్రీన్, టైటానియం గోల్డ్‌, ప్యూర్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

ఈ ఐటెల్‌ స్మార్ట్‌ఫోన్ రిటైల్‌ స్టోర్స్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కొనుగోలు చేసిన తొలి 100 రోజుల వరకు ఉచితంగా స్క్రీన్‌ను రీఫ్లేస్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.

Best Mobiles in India

English summary
itel A100 4G smartphone with military grade certification and 5000mAh battery launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X