1.2 మీటర్ల నుంచి కిందపడినా డ్యామేజీ కాని స్మార్ట్‌ఫోన్.. వన్‌ప్లస్ 15 తరహా డిజైన్ సహా ఫీచర్‌లు ఇవిగో..!
ఐటెల్ సంస్థ భారత్ మార్కెట్‌లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఐటెల్ A100C పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను (Itel A100C Smartphone) విడుదల చేసింది. ఈ ఐటెల్ స్మార్ట్‌ఫోన్.. త్వరలో విడుదల కానున్న వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను పోలి ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ ఐటెల్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు, ధర పూర్తి వివరాలు.
ఐటెల్ A100C స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు :
ఈ ఐటెల్ స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల (720 x 1612 పిక్సల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్ రేట్, 400 నిట్స్ బ్రైట్‌నెస్, 90 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియోను కలిగి ఉంది. ఈ ఫోన్ 8.49mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది.

1.22 మీటర్ల నుంచి కిందపడినా :
ఈ హ్యాండ్‌సెట్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఈ ఫీచర్ కారణంగా స్మార్ట్‌ఫోన్ పొరపాటు 1.22 మీటర్ల నుంచి కిందపడినా డ్యామేజీ కాదని సంస్థ చెబుతోంది. మరియు అధిక ఉష్ణోగ్రత, తేమ నుంచి కూడా ఫోన్‌ను రక్షిస్తుంది.
ప్రాసెసర్, కెమెరా వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ Unisoc T7100 ఆక్టా కోర్ ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 4GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్ పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా ఐటెల్ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు 8MP కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను అమర్చి ఉంది.
32 రోజుల స్టాండ్‌బై టైం :
ఐటెల్ A100C స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేసి 8.5 గంటల వరకు గేమింగ్ కోసం ఉపయోగించుకోవచ్చని లేదా 27.7 గంటల కాలింగ్ సమయాన్ని పొందవచ్చని ఐటెల్ చెబుతోంది. ఈ ఫోన్ 32 రోజుల స్టాండ్‌బై సమయాన్ని పొందవచ్చని తెలిపింది.
భారత్ మార్కెట్‌లో ఐటెల్ A100C స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు వెల్లడి కాలేదు. త్వరలో స్టోరేజీ, ధర, సేల్ వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ హ్యాండ్‌సెట్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ప్యూర్ బ్లాక్, టైటానియం గోల్డ్, బ్లేజ్ బ్లూ, సిల్క్ గ్రీన్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.
* గత నెలలో ఐటెల్ A90 లిమిటెడ్ ఎడిషన్ విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ హ్యాండ్‌సెట్ MIL STD 810H షాక్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. మరియు IP54 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఈ లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ Unisoc T7100 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్ పైన పనిచేస్తోంది. 13MP కెమెరా, LED ఫ్లాష్, 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 15W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








